Curd at Night: రాత్రి సమయంలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా? తప్పక తెలుసుకోండి..

|

Jul 03, 2023 | 5:55 AM

కూరగాయలతో అన్నం తిన్న తరువాత, చివర్లో కాస్త పెరుగుతో తినకపోతే అన్నం తిన్న భావనే కలుగదు. పెరుగు అన్నం అంత రుచిగా ఉంటుంది మరి. రుచి మాత్రమే కాదు.. ఇందులో ఆరోగ్య ప్రయోజనం కూడా దాగుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Curd at Night: రాత్రి సమయంలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా? తప్పక తెలుసుకోండి..
Curd
Follow us on

కూరగాయలతో అన్నం తిన్న తరువాత, చివర్లో కాస్త పెరుగుతో తినకపోతే అన్నం తిన్న భావనే కలుగదు. పెరుగు అన్నం అంత రుచిగా ఉంటుంది మరి. రుచి మాత్రమే కాదు.. ఇందులో ఆరోగ్య ప్రయోజనం కూడా దాగుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పెరుగును ఏ విధంగానైనా తీసుకోవచ్చు. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుతుంది. ఆరోగ్య నిపుణులు కూడా ఆహారంలో పెరుగును తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తుంటారు.

అయితే, చాలామందికి రాత్రి నిద్రపోయే ముందు పెరుగు తింటారు. పెరుగులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపకరిస్తాయి. అయితే, రాత్రి భోజనం సమయంలో పెరుగు తినడం మంచిదేనా? అనేది చాలామందిలో ఉన్న సందేహం. ఆ సందేహాన్ని ఇప్పుడు క్లియర్ చేసుకుందాం.

రాత్రి వేళ పెరుగు తినొచ్చా?

రాత్రిపూట పెరుగు తినడం వల్ల ఎలాంటి హాని ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే, జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రి పడుకునే ముందు పెరుగు తినడం వల్ల సమస్యలు వస్తాయి. ఇది కొవ్వు, ప్రోటీన్లతో కూడిన పాల ఉత్పత్తి. ఇది రాత్రిపూట జీర్ణం కావడం కష్ట అవుతుంది. రాత్రిపూట తినడం వలన మెటబాలిజం నెమ్మదిగా పనిచేస్తుంది. ఈ కారణంగా మన జీర్ణవ్యవస్థ నెమ్మదిగా పని చేస్తుంది.

ఇవి కూడా చదవండి

కఫం సమస్య పెరుగుతుంది..

ఆయుర్వేదం ప్రకారం, పెరుగు శరీరంలో కఫ దోషాన్ని పెంచుతుంది. రాత్రిపూట శరీరంలో కఫం పెరిగే అవకాశం ఎక్కువ. దీని కారణంగా, నాసికా భాగాలలో శ్లేష్మం వృద్ధి చెందే ప్రమాదం ఉంది. అయినప్పటికీ, అందరిలోనూ ఇదే ప్రభావం ఉంటుందని చెప్పలేమంటున్నారు వైద్యులు, ఆరోగ్య నిపుణులు. ఒక్కొక్కరి శరీర తత్వాన్నిబట్టి మార్పు ఉంటుందంటున్నారు. అయితే, ఆస్తమా, దగ్గు, జలుబు వంటి సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగు తినకూడదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

పెరుగు తినడానికి సరైన సమయం ఏది?

రాత్రిపూట పెరుగు తినకుండా, ఉదయం లేదా మధ్యాహ్న భోజనంలో పెరుగు తినొచ్చు. ఈ సమయంలో పెరుగు తినడం వలన సులభంగా జీర్ణం అవుతుంది. ఉదయం అల్పాహారంగా కూడా పెరుగును తినవచ్చు.

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం ఆరోగ్య నిపుణులు తెలిపిన సూచనల ప్రకారం ఇవ్వడం జరిగింది. దీనిని TV9 తెలుగు ధృవీకరించడంలేదు. నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే దీనిని అనుసరించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..