Covid-19: కరోనా వచ్చినప్పుడు వాసన కోల్పోయారా.. వాటి డ్యామేజ్ వల్లేనేనంటున్న పరిశోధనలు..

|

Apr 18, 2022 | 9:30 AM

Covid-19: కరోనా సమయంలో చాలా మంది వాసన గ్రహణ శక్తిని కోల్పోయారు. దానికి కారణం ఏమిటో పరిశోధకులు కనుగొన్నారు. దానికి మెదడులో అవి పాడవ్వటం వల్లనేనని తేలింది.

Covid-19: కరోనా వచ్చినప్పుడు వాసన కోల్పోయారా.. వాటి డ్యామేజ్ వల్లేనేనంటున్న పరిశోధనలు..
Corona
Follow us on

Covid-19: JAMA న్యూరాలజీ నిర్వహించిన పరిశోధన ప్రకారం.. కరోనా సోకినప్పుడు మెదడులోవాసనకు సంబంధించిన భాగం దెబ్బతిన్నందునే బాధితులు వాసన(Smell Loss) కోల్పోయినట్లు వెల్లడైంది. కరోనా సోకిన వారిలో రక్త నాణాలతో పాటు వాసన గ్రహణకు సహకరించే ఓల్ ఫ్యాక్టరీ బల్బ్(olfactory Bulb) దెబ్బతిన్నట్లు తెలిసింది. కరోనా రోగులు వ్యాధి లేని వారి కంటే 60% ఎక్కువ తీవ్రమైన ఆక్సాన్ క్షీణత, మైక్రోస్కోపిక్ రక్త నాళాలకు 36% ఎక్కువ తీవ్రమైన నష్టాన్ని చూశారని బయటపడింది. కొవిడ్-ప్రేరిత వాసన కోల్పోవడం తీవ్రమైనదని, కోలుకోలేనిదని ఇది సూచిస్తుంది. కరోనా ఇన్‌ఫెక్షన్‌ల వల్ల మెదడు కుంచించుకుపోవడం, కణజాలం దెబ్బతింటాయని ఊహించిన మునుపటి నివేదికల మాదిరిగానే ఈ ఫలితాలు ఉన్నాయి.

మెదడులో ఈ నష్టం నేరుగా కరోనా వైరస్ వల్ల సంభవించదని, బహుశా పరోక్షంగా ఆ ప్రాంతంలో ఇన్ఫమేషన్ల వంటి లక్షణాల వల్ల సంభవించవచ్చని తాజా పరిశోధన నిర్ధారించింది. కరోనా కారణంగా వాసన కోల్పోవటానికి సంబంధించి ఎటువంటి ప్రత్యేర రీసెర్చ్ లేదని కొన్ని సార్లు దానంతట అదే రోగుల్లో సమస్య పరిష్కరించబడింది. కానీ కొన్ని పరిశోధనలు మాత్రం మెదడులోని olfactory cleft డ్యామేజ్ కావటం వల్లనే అలా జరిగిందని చెబుతున్నాయి.

ఇవీ చదవండి..

Economic crisis: దేశంలోని ఆ రాష్ట్రాల్లో శ్రీలంక లాంటి ఆర్థిక సంక్షోభం.. ప్రధానికి అధికారులు వెల్లడి.. ఎందుకంటే..

World Bank Report: దేశంలో గణనీయంగా తగ్గిన పేదరికం.. వారి ఆదాయం మాత్రం ఏటా 10% పెరిగింది..