కొత్తిమీరలో ఎన్నో ఔషధగుణాలు దాగున్నాయి.. రోజూ కొత్తిమీర రసాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.. దీనిని అన్ని రకాల వంటలలో ఉపయోగించే ముఖ్యమైన ఆహార పదార్ధం.. కొత్తిమీర ఆకు, కాండం, వేరు అన్నీ ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కొత్తిమీర రసం తాగడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి. కొత్తిమీర ఆకులలో విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి.. వీటితోపాటు విటమిన్ ఎతో పాటు విటమిన్ Kకూడా ఉన్నాయి. ఈ పోషకాలు మీ రోగనిరోధక శక్తిని క్రమంగా పెంచడంతోపాటు.. శరీర అభివృద్ధికి దోహదపడతాయి.. దీంతోపాటు పలు సమస్యలను దూరం చేస్తాయి.
కొత్తిమీర మీ బ్లడ్ షుగర్‌ని తగ్గించడంలో, ఇన్‌ఫెక్షన్‌లతో పోరాడటానికి, గుండె, మెదడు, చర్మం, కాలేయం, ఎముకలు, రక్తం గడ్డకట్టడంలో.. జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబతున్నారు. అందుకే.. ప్రతీరోజు ఉదయాన్నే పరగడుపున కొత్తిమీర రసాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.
కొత్తిమీర ఆకులను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల పొట్ట శుభ్రంగా ఉండి గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.
కొత్తిమీరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
ఖాళీ కడుపుతో కొత్తిమీర ఆకు నీటిని తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న కొత్తిమీర రసాన్ని ఖాళీ కడుపుతో తీసుకుంటే కీళ్ల వాపులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
కొత్తిమీర రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్రపిండాలతో సహా అన్ని రకాల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
కొత్తిమీర రసం తయారుచేసే ముందు ఆకులను బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఆ తర్వాత కత్తితో కోసి మెత్తగా రుబ్బుకుని పేస్ట్ లా చేసుకోవాలి. అవసరం మేరకు నీళ్లు పోసి మళ్లీ రుబ్బుకోవాలి. దాని రసాన్ని ఒక గిన్నెలో తీసుకుని ఫిల్టర్ చేసి దానిలో కొంచెం నిమ్మరసం కలపండి. ఆ తర్వాత తాగాలి..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..