
శరీరంలో ప్యూరిన్ అనే పదార్థం విచ్ఛిన్నమైనప్పుడు యూరిక్ యాసిడ్ అనే వ్యర్థ పదార్థం ఏర్పడుతుంది. ఇది సాధారణంగా మూత్రం ద్వారా బయటకు వెళుతుంది. కానీ శరీరం సరిగా దీన్ని బయటకు పంపకపోతే అది రక్తంలో చేరి కీళ్లలో చేరుతుంది. దీనితో కీళ్లలో వాపు, నొప్పి, నడవలేకపోవడం వంటి ఇబ్బందులు వస్తాయి.
ఈ పరిస్థితిని సహజంగా నియంత్రించాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు ఎంతో ఉపయోగపడతాయి. వాటిలో ముఖ్యంగా పచ్చి బొప్పాయి ముందు వరుసలో ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, సి, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలున్నాయి. ఇవి శరీరాన్ని శుద్ధి చేయడంలో, అంతర్గతంగా వ్యర్థాలను తొలగించడంలో మెరుగైన పనితీరును చూపిస్తాయి.
యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించేందుకు బొప్పాయిని కషాయంగా తయారు చేసి తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది శరీరానికి తేలికగా జీర్ణమై, రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. బొప్పాయి కషాయాన్ని తయారు చేయడం చాలా సులువు.
తాజా పచ్చి బొప్పాయిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో ఒక గ్లాసు నీరు వేసి.. అందులో ఈ ముక్కలను సుమారు 5 నిమిషాలు మరిగించాలి. మరిగిన తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. ఆ రసాన్ని వడగట్టి ఒక కప్పులోకి పోసి చిటికెడు రాతి ఉప్పు కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచిది. ఇది యూరిక్ యాసిడ్ ను సహజంగా నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఈ ప్రక్రియను వారంలో మూడుసార్లు అనుసరిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే దీన్ని వైద్యుల సలహా మేరకు తీసుకోవడం ఉత్తమం. ఎప్పటికప్పుడు యూరిక్ యాసిడ్ స్థాయిలను పరీక్షించుకుంటూ.. ఆహారం జీవనశైలి మార్పులు చేసుకుంటే ఈ సమస్యను అదుపులో ఉంచవచ్చు.
పచ్చి బొప్పాయితో తయారైన ఈ కషాయం ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా వ్యర్థ పదార్థాల తొలగింపులో సహాయపడుతుంది. సహజమైన మార్గాల్లో ఆరోగ్య సమస్యలను పరిష్కరించాలనుకునే వారికి ఇది ఉత్తమ పరిష్కారంగా నిలుస్తుంది. వ్యాధిని తగ్గించాలంటే సహజమైన మార్గాలే స్థిరమైన ఫలితాలు ఇస్తాయి.