మనం ఎంత అభివృద్ధి చెందుతున్నా.. కొన్ని అపోహలు మాత్రం ఇప్పటికీ తొలిగిపోవడం లేదు. ముఖ్యంగా గర్భనిరోధక పద్ధతుల(Contraceptive Methods)పై చాలా మందికి అపోహలు ఉన్నాయి. గర్భనిరోధకాలు వంధ్యత్వానికి కారణమని అపోహ ఉంది. కానీ ఇది నిజం కాదు. దేశంలో, కండోమ్‌లు, మాత్రలు(Tablets), గర్భనిరోధక ఇంజెక్షన్‌లు, ఇంప్లాంట్లు, ప్రాచుర్యం పొందిన గర్భనిరోధక పద్ధతులు ఉన్నాయి. కానీ చాలా మందికి వీటిపై అపోహలు ఉన్నాయి. అలాగే లాంగ్-యాక్టింగ్ రివర్సిబుల్ గర్భనిరోధక పద్ధతులు రుతుక్రమ సమస్యలను కలిగిస్తాయని అపోహ ఉంది. కానీ లాంగ్-యాక్టింగ్ రివర్సిబుల్ కాంట్రాసెప్టైవ్స్ (LARC) అనేది సుదీర్ఘకాలం పాటు ప్రభావవంతమైన గర్భనిరోధకతను అందించే గర్భనిరోధక పద్ధతుల్లో ఒకటి. ఇంజెక్షన్లు, ఇంట్రాయూటరైన్ పరికరాలు (IUD), సబ్‌డెర్మల్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్లు వీటికి ఉదాహరణలు.
నిజం ఏమిటంటే.. ఋతు చక్రం లేదా ప్రవాహంలో మార్పులు ఉపయోగించే LARC రకాన్ని బట్టి మారవచ్చు. మహిళల ఆరోగ్యంపై దృష్టి ఉంచుకోని భారతదేశ కుటుంబ నియంత్రణ వ్యూహంలో భాగంగా ఇంప్లాంట్లు వంటి రివర్సిబుల్ గర్భనిరోధకాలను పెంచాల్సిన అవసరం పెరుగుతోంది. అలాగే గర్భనిరోధకాలు వాడితే బరువు పెరుగుతారని అపోహ ఉంది. కానీ దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే చాలా మంది యువతులు తమ బరువు పెరగడానికి గర్భనిరోధకాలు కారణమని ఆరోపిస్తున్నారు. గర్భనిరోధక సాధనాలు దీర్ఘకాలం ఉపయోగించడం వల్ల స్త్రీల్లో బిడ్డను కనే సామర్థ్యాన్ని ప్రభావితం చేయవచ్చని అపోహ ఉంది. గర్భనిరోధకాలు గర్భాన్ని నిరోధించడంలో మాత్రమే సహాయపడతాయి. ఇది పిల్లలను కనే సామర్థ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదు.
గర్భనిరోధక ఇంప్లాంట్లు గర్భాన్ని నిరోధించడంలో 99% ప్రభావవంతంగా ఉంటాయి. ఇంప్లాంట్ రాడ్లలోని ప్రొజెస్టిన్లు నెమ్మదిగా స్త్రీ రక్తప్రవాహంలోకి విడుదలవుతాయి. ప్రొజెస్టిన్లు ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ లాంటివి, ఇది సహజంగా స్త్రీ శరీరం ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఇంప్లాంట్లు పెట్టిన వెంటనే గర్భం రాకుండా చేస్తుంది. వారు ఇంప్లాంట్ రకాన్ని బట్టి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. కానీ ఏ క్షణంలోనైనా ఉపసంహరించుకోవచ్చు. ఇంప్లాంట్ తొలగించిన వెంటనే సంతానోత్పత్తి పునరుద్ధరించుకోవచ్చు.
గమనిక: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించాలి.
Read Also.. Sugarcane Juice: ఈ సమస్యలు ఉన్నవారు చెరకు రసం అస్సలు తాగకూడదు.. ఎందుకంటే..