Uric Acid Control Tips: యూరిక్ యాసిడ్ బాధితులు ఉప్పు తీసుకోవచ్చా?.. నిపుణులు ఏమంటున్నారంటే..

|

Nov 14, 2022 | 4:17 PM

యూరిక్ యాసిడ్‌తో బాధపడుతున్నవారు ఎక్కువగా నీరు తీసుకోవాలి. లేకుంటే అనేక సమస్యలు వస్తుంటాయి.

Uric Acid Control Tips: యూరిక్ యాసిడ్ బాధితులు ఉప్పు తీసుకోవచ్చా?.. నిపుణులు ఏమంటున్నారంటే..
అరటిపండులో చాలా తక్కువ మొత్తంలో ప్యూరిన్ ఉందని మీకు తెలియజేద్దాం. మరోవైపు, మీరు ప్రతిరోజూ అరటిపండ్లను తీసుకుంటే, ఆర్థరైటిస్ వంటి తీవ్రమైన వ్యాధులలో ప్రయోజనం ఉంటుంది.
Follow us on

యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే టాక్సిన్.. ఇది ప్రతి ఒక్కరి శరీరంలో తయారవుతుంది. యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అయినప్పుడు.. మూత్రపిండాలు దానిని ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా శరీరం నుంచి తొలగిస్తాయి. యూరిక్ యాసిడ్ ఏర్పడటానికి ఆహారం చాలా బాధ్యత వహిస్తుంది. ప్యూరిన్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల చేతులు, కాళ్ల కీళ్లలో నొప్పి వచ్చి లేచి కూర్చోవడానికి ఇబ్బందిగా మారుతుంది. యూరిక్ యాసిడ్ నార్మల్ రేంజ్‌లో ఉన్నా ఫర్వాలేదు కానీ దాని అధిక స్థాయి కారణంగా శరీరంలో అనేక సమస్యలు మొదలవుతాయి. పెరిగిన యూరిక్ యాసిడ్ లక్షణాలు వేళ్లు, కాలి వేళ్లలో నొప్పి, చీలమండలలో నొప్పి, వాపు, చర్మం ఎర్రబడటం, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం, మూత్రపిండాల్లో రాళ్లు , కీళ్ల నొప్పి ఇలా చాలా సమస్యలు వస్తుంటాయి. ఈ యాసిడ్లు రక్తంలో కలసి రక్తాన్ని కలుషితం చేసి శరీరంలో అనేక రకాల రుగ్మతలను కలిగిస్తాయి. యూరిక్ యాసిడ్ పెరిగితే అది మన శరీరంలోని అనేక అవయవాలను దెబ్బతీస్తుంది.

ఆయుర్వేద నిపుణుల పరిశోధనల్లో తేలిన వాస్తవాలను వెల్లడించారు. యూరిక్ యాసిడ్ రోగులు ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకోవడం. మరికొన్నింటికి దూరంగా ఉంటే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఉప్పు తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుందని కొందరి నమ్మకం. ఉప్పు తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ నిజంగా పెరుగుతుందో లేదో ఆయుర్వేద నిపుణులు ఏమంటున్నారో ఓ సారి తెలుసుకుందాం.

ఉప్పు తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుందా..? ఉప్పు యూరిక్ యాసిడ్‌ని పెంచుతుందా..?

ఉప్పు మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. వంటలకు రుచి రావాలంటే ఉప్పు ఉండాల్సిందే. అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అంటుందంటా ఉప్పు. ఉప్పు వంటల్లో చాలా ప్రత్యేకత ఉంటుంది. అది లేకుండా ఆహారం రుచి అసంపూర్ణంగా ఉంటుంది. ఉప్పును పరిమితంగా తీసుకుంటే.. ఆహారం రుచికరంగా కనిపిస్తుంది. కానీ ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల బారిన పడవచ్చు. మితిమీరిన ఉప్పు అధిక రక్తపోటు వ్యాధి ప్రమాదాన్ని పెంచడమే కాకుండా.. దానిని తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అయితే యూరిక్ యాసిడ్ పేషెంట్లు ఉప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని మీకు తెలుసా..

ఉప్పు యూరిక్ యాసిడ్‌ను ఎలా నియంత్రిస్తుందో చూద్దాం..

అధిక సోడియం తీసుకోవడం యూరిక్ యాసిడ్ వ్యాధిలో శరీరాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుందని తాజా పరిశోధనల్లో తేలింది. ఆగస్ట్ 15న ఆర్థరైటిస్, రుమటాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, యూరిక్ యాసిడ్ సగటు సోడియం కంటే ఎక్కువగా తీసుకోవడం ద్వారా నియంత్రించబడుతుంది.

యూరిక్ యాసిడ్ రోగులు రాతి ఉప్పును(రాక్ సాల్ట్) తీసుకుంటే శరీరానికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. కిడ్నీలో రాళ్లను కూడా రాళ్ల ఉప్పు తీసుకోవడం ద్వారా నయం చేయవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల ఎముకల నొప్పి, వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది.

యూరిక్ యాసిడ్ నియంత్రణ కోసం ఈ ఆహారాలను తినండి:

  • ఆల్కలీన్ డైట్, ఆల్కలీన్ వాటర్ తీసుకుంటే యూరిక్ యాసిడ్ నియంత్రణ ఉంటుంది.
  • ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు తినండి. పండ్లలో యాపిల్ లేదా యాపిల్ వెనిగర్ తీసుకోవడం చాలా మేలు చేస్తుంది.
  • బాదం, వాల్‌నట్‌లను తీసుకోవాలి.
  • అలోవెరా జెల్ తినండి.
  • క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్(జ్యూస్ కంటే క్యారెట్, బీట్‌రూట్ కట్ చేసుకుని తినడం చాలా మంచింది) తాగడం ద్వారా యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది.
  • ఉసిరి తినండి. కొబ్బరి నీళ్లు తాగండి.
  • పొట్టను శుభ్రంగా ఉంచుకోవాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోండి. సమయానికి తినండి. హాయిగా నిద్రపోండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం