Coconut Oil: కొబ్బరి నూనెను ఇలా వాడండి.. పసుపు దంతాలు సహా 5 సమస్యలకు చెక్ పెట్టొచ్చు..

|

Jul 03, 2023 | 6:49 AM

కొబ్బరి నూనె చర్మం, జుట్టు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉత్తమ మాయిశ్చరైజింగ్ ఏజెంట్‌గా పరిగణించబడే కొబ్బరి నూనెను అనేక విధాలుగా ఉపయోగించొచ్చు. దీని ద్వారా కలిగే నష్టం కూడా చాలా తక్కువ. మన చర్మాన్ని లోపల, వెలుపల నుంచి సంరక్షించే అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి.

Coconut Oil: కొబ్బరి నూనెను ఇలా వాడండి.. పసుపు దంతాలు సహా 5 సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
Coconut Oil
Follow us on

కొబ్బరి నూనె చర్మం, జుట్టు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉత్తమ మాయిశ్చరైజింగ్ ఏజెంట్‌గా పరిగణించబడే కొబ్బరి నూనెను అనేక విధాలుగా ఉపయోగించొచ్చు. దీని ద్వారా కలిగే నష్టం కూడా చాలా తక్కువ. మన చర్మాన్ని లోపల, వెలుపల నుంచి సంరక్షించే అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి. రాత్రి పూట నూనెతో మసాజ్ చేస్తే మరుసటి రోజు ఉదయం వరకు దీని ప్రభావం కనిపిస్తుంది. కొబ్బరి నూనె 7 సమస్యలను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

దంతాలపై పసుపు రంగు తొలగింపు..

కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇందులో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది బ్యాక్టీరియాను చంపి దంత క్షయాన్ని నివారిస్తుంది. చిగుళ్ల వాపు, దంతాల సున్నితత్వాన్ని తగ్గించడమే కాకుండా.. దంతాలను తెల్లగా చేయడంలో కూడా ఉపయోగపడుతుంది . వారానికి రెండు మూడు సార్లు కొబ్బరి నూనెను దంతాలపై మసాజ్ చేయాలి.

జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది..

జుట్టు వేగంగా రాలిపోతుంటే కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం ప్రారంభించాలి. కొబ్బరి నూనెను వారానికి రెండు మూడు సార్లు జుట్టుకు పట్టించి, ఆపై షాంపూ కండీషనర్ ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు దృఢంగా మారడమే కాకుండా నిగనిగలాడుతుంది. ఈ నూనెలో కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేసి అప్లై చేసి తేడా చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

గోర్లను సంరక్షిస్తుంది..

కొబ్బరి నూనె గోర్లు, దాని చుట్టూ ఉన్న చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా మేలు చేస్తుంది. రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను గోళ్లకు, చుట్టూ ఉన్న చర్మానికి అప్లై చేసి నిద్రించాలి. తద్వారా గోర్ల చుట్టూ చర్మం పగిలే సమస్య నుంచి బయటపడొచ్చు.

కనురెప్పలు..

కనురెప్పలు కళ్లకు, ముఖానికి అందాన్ని పెంచేందుకు పనిచేస్తాయి. వాటిని బలంగా, దట్టంగా చేయాలనుకుంటే.. నిద్రపోయే ముందు వాటిపై ఆయిల్ రాయాలి. అయితే, కళ్ళలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

కనుబొమ్మలు..

కనుబొమ్మల వెంట్రుకలు హల్క్‌గా ఉండటం వల్ల కొన్నిసార్లు లుక్ చెడుగా కనిపిస్తుంది. కనుబొమ్మల వెంట్రుకలు నల్లగా లేదా ఒత్తుగా ఉండాలంటే వాటిపై కూడా కొబ్బరి నూనె రాసుకోవడం మంచిది. రాత్రి పడుకునే ముందు అప్లై చేస్తే ప్రయోజనం ఉంటుంది.

పెదవుల కోసం..

వేసవిలో కూడా పెదవుల చర్మం పొడిబారడం మొదలవుతుంది. తేమ లేకపోవటం వల్ల పెదవులు పగుళ్లు రావడంతో పాటు నొప్పి ఎక్కువగా ఉంటుంది. పెదవుల సమస్య ఉంటే, రోజుకు కనీసం రెండుసార్లు నూనె రాయాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..