Health Tips: వర్షాకాలంలో ఈ నూనెలను వంటలకు ఉపయోగిస్తే సమస్యలు తప్పవు
వర్షాకాలానికి అనుగుణంగా డైట్ మార్చుకుంటే రకరకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. కాబట్టి, వర్షాకాలంలో వంట చేయడానికి ఏ నూనెను ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి...
వర్షాకాలంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ సమయంలో రకరకాల సీజనల్ వ్యాధులు అటాక్ చేస్తుంటాయి. అందుకే అప్రమత్తత అవసరం. అలానే వర్షాకాంలో కొన్ని ఆహారపదార్థాలను మార్చుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వర్షాకాలానికి అనుగుణంగా డైట్ మార్చుకుంటే రకరకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. కాబట్టి, మీరు తినే ఆహారాన్ని మార్చడం ఎంత ముఖ్యమో సరైన వంట నూనెలను మార్చడం కూడా అంతే ముఖ్యం.
వర్షాకాలంలో ఏ నూనె వాడకూడదు..?
ఆవాల నూనె, నెయ్యి, పామాయిల్ వంటి నూనెలను వర్షాకాలంలో వాడడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ నూనెలను ఉపయోగించడం వల్ల మన శరీరంలో పిత్త శాతం పెరుగుతుంది. ఇది వివిధ ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ నూనెలకు దూరంగా ఉండటం మంచిది.
వర్షాకాలంలో ఏ నూనెలు ఉపయోగించవచ్చు..?
వాతావరణంలో మార్పులు ఎక్కువగా ఉండే రెయినీ సీజన్‌లో తేలికైన నూనెలను ఉపయోగించవచ్చు. కార్న్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ మొదలైన వాటిని వంటల కోసం ఉపయోగించడం మంచిది. దీనిని వాడితే కడుపునొప్పి వంటి సమస్యలు దరిచేరవు.
అలాగే వర్షాకాలంలో సమోసాలు, పకోడాలు, ఇతల వేయించిన పదార్థాలు తినకూడదు. ఇలాంటి ఫ్రైడ్ ఐటమ్స్‌లో నూనెను ఎక్కువగా వాడటం వలన అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ వంటి కడుపు సమస్యలు వస్తాయి. వర్షాకాలంలో ఈ సమస్యలు మరింత ఇబ్బందికరంగా మారతాయి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.
(ఈ సమాచారం నిపుణుల నుంచి సేకరించబడింది. ఫాలో అయ్యేముందు డైటీషియన్లను సంప్రదించండి)