Cancer: పట్టించుకోరు.. కానీ ప్రాణాంతకం.. క్యాన్సర్ వస్తే కనిపించే లక్షణాలు ఇవే..

World cancer day 2026: క్యాన్సర్ (Cancer) అనేది శరీరంలోని కణాలు అసాధారణంగా.. అనియంత్రితంగా విభజన చెంది, కణజాలాలను ఆక్రమించి ఇతర అవయవాలకు వ్యాపించే ప్రాణాంతక వ్యాధి.. జన్యు మార్పులు, పొగాకు, రేడియేషన్, జీవనశైలి కారకాల వల్ల కణాలు కణతులుగా (Tumors) మారుతాయి. ప్రారంభంలోనే గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది.

Cancer: పట్టించుకోరు.. కానీ ప్రాణాంతకం.. క్యాన్సర్ వస్తే కనిపించే లక్షణాలు ఇవే..
Cancer Symptoms

Updated on: Jan 31, 2026 | 3:07 PM

భారతదేశం సహా.. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి కేసులు వేగంగా పెరుగుతూనే ఉన్నాయి.. పలు అధ్యయనాల ప్రకారం.. ఏటా లక్షలాది కేసులు వెలుగుచూస్తున్నాయి.. ఇది ప్రాణాంతక వ్యాధి.. సకాలంలో గుర్తిస్తే.. కాన్సర్ నుంచి జయించవచ్చు.. అయితే.. పరిస్థితిని బట్టి చికిత్స మారుతూ ఉంటుంది.. క్యాన్సర్ (Cancer) అనేది శరీరంలోని కణాలు అసాధారణంగా.. అనియంత్రితంగా విభజన చెంది, కణజాలాలను ఆక్రమించి ఇతర అవయవాలకు వ్యాపించే ప్రాణాంతక వ్యాధి.. జన్యు మార్పులు, పొగాకు, రేడియేషన్, జీవనశైలి కారకాల వల్ల కణాలు కణతులుగా (Tumors) మారుతాయి. ప్రారంభంలోనే గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది. సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ లాంటి చికిత్స లతో దీనిని నియంత్రిస్తారు. క్యాన్సర్ అనేది.. అవయవాలకు, చర్మం, రక్తం, ఎముకలు.. ఇలా భాగంలోనైనా వ్యాప్తి చెందుతుంది. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా, ఊపిరితిత్తులు, రొమ్ము, ప్రోస్టేట్ మరియు కడుపు క్యాన్సర్ కేసులు వేగంగా పెరిగాయి. దీని గురించి అవగాహనతో ఉండి.. సకాలంలో చికిత్స పొందితే.. ప్రాణాలతో బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే.. క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ఢిల్లీలోని యాక్షన్ క్యాన్సర్ హాస్పిటల్‌లోని మెడికల్ ఆంకాలజీ విభాగం డాక్టర్ జె.బి. శర్మ ప్రకారం.. క్యాన్సర్ గురించి ఒక ప్రధాన ఆందోళన ఏమిటంటే, ప్రజలు తరచుగా దాని లక్షణాల గురించి తెలియకపోవడమే. క్యాన్సర్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు అంటున్నారు. దాని లక్షణాలపై శ్రద్ధ వహించడం, సకాలంలో చికిత్స పొందడం ద్వారా, క్యాన్సర్‌ను నివారించవచ్చు. క్యాన్సర్ కు సంబంధించి కొన్ని సాధారణ లక్షణాలు ఎలా ఉంటాయి.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

మెడికల్ ఆంకాలజీ విభాగం వైద్యుల ప్రకారం.. క్యాన్సర్ వ్యాధి ప్రమాదకరమైనది.. ప్రాణాంతకమైనది.. కానీ ముందుగానే గుర్తించడం వల్ల చికిత్స పొందవచ్చు.

క్యాన్సర్ లక్షణాలు

మీరు ఎటువంటి ఆహార మార్పులు లేదా వ్యాయామం లేకుండా వేగంగా బరువు తగ్గుతుంటే, ఇది క్యాన్సర్‌కు ప్రధాన సంకేతం. ఇంకా, మీరు రక్తహీనతను ఎదుర్కొంటుంటే, దానిని విస్మరించవద్దు. ఇవి ఏ రకమైన క్యాన్సర్‌కు అయినా సంకేతంగా ఉండే రెండు సాధారణ క్యాన్సర్ లక్షణాలు. ఇంకా, కడుపు నొప్పి, రొమ్ము గడ్డలు లేదా వాపును కూడా విస్మరించకూడదు. క్యాన్సర్ లక్షణాలు రకం మరియు కణితి ఉన్న ప్రదేశాన్ని బట్టి మారుతుంటాయి. సాధారణ లక్షణాలలో వివరించలేని తీవ్రమైన బరువు తగ్గడం, అలసట, చర్మం కింద గడ్డలు, నిరంతర జ్వరం, రాత్రుళ్లు చెమటలు పట్టడం, చర్మం రంగు మారడం వంటి వాటిని గమనిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించాలి..

నేటి కాలంలో ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, జీవనశైలి సరిగా లేకపోవడం, పొగాకు వాడకం, హార్మోన్ల అసమతుల్యత కారణంగా ప్రజలు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. అందువల్ల, క్యాన్సర్ లక్షణాలపై శ్రద్ధ వహించడం, వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. రోగి పరిస్థితికి అనుగుణంగా వైద్యులు చికిత్సను అందిస్తారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..