IIT Madras: మన పోపుల పెట్టే సౌషధాల గని.. క్యాన్సర్ కు మసాలా వస్తువులతో మెడిసిన్స్.. పేటెంట్ హక్కులు పొందిన మద్రాస్ ఐఐటీ

|

Feb 26, 2024 | 8:34 AM

కొన్ని వ్యాధుల నివారణకు వంటింటి చిట్కాలను ఆశ్రయిస్తారు. అయితే ఇప్పుడు ఈ మసాలాలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా నయం చేస్తాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఐఐటి మద్రాస్ పరిశోధకులు వెల్లడించారు. మద్రాస్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పరిశోధకులు క్యాన్సర్ చికిత్సకు భారతీయ మసాలా దినుసుల వినియోగించే విషయంలో పేటెంట్ రైట్స్ పొందారు. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం 2028 నాటికి ఈ మందులు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

IIT Madras: మన పోపుల పెట్టే సౌషధాల గని.. క్యాన్సర్ కు మసాలా వస్తువులతో మెడిసిన్స్.. పేటెంట్ హక్కులు పొందిన మద్రాస్ ఐఐటీ
Indian Spices Cure Cancer
Follow us on

భారతీయుల  వంట ఇల్లే ఒక ఔషధ శాల.. పోపుల పెట్టె ఓ ఔషదాల గని..  భారతీయులు ఆహార ప్రియులు.  రుచులు, అభిరుచులు మిగతా ప్రపంచ వాసుల కంటే భిన్నం. భారతీయులు సాధారణంగా ఆహారం రుచిని పెంచడానికి మసాలా దినుసులను ఉపయోగిస్తారు. ఈ మసాలాలు ఆహారాన్ని మరింత రుచికరంగా చేస్తాయి. అంతే కాదు కొన్ని రకాల మసాలా దినుసులు ముఖ చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. అందుకనే కొన్ని వ్యాధుల నివారణకు వంటింటి చిట్కాలను ఆశ్రయిస్తారు. అయితే ఇప్పుడు ఈ మసాలాలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా నయం చేస్తాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఐఐటి మద్రాస్ పరిశోధకులు వెల్లడించారు.

మద్రాస్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పరిశోధకులు క్యాన్సర్ చికిత్సకు భారతీయ మసాలా దినుసుల వినియోగించే విషయంలో పేటెంట్ రైట్స్ పొందారు. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం 2028 నాటికి ఈ మందులు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

క్యాన్సర్ కు మాసాలలతో చికిత్స గురించి మరింత సమాచారంలోకి వెళ్తే.. ఈ మసాలా దినుసులతో తయారు చేయబడిన నానో మందులు ఊపిరితిత్తులు, గర్భాశయం, రొమ్ము, పెద్దప్రేగు, నోటి, థైరాయిడ్‌లోని క్యాన్సర్ కణాలపై ప్రభావాన్ని చూపుతాయని చెప్పారు. అదే సమయంలో ఈ మెడిసిన్ వాడడం వలన సాధారణ కణాలకు ఎటువంటి హాని జరగదని.. సురక్షితంగాఉంటాయని అధికారులు తెలిపారు. ఈ మెడిసిన్ సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకుని వచ్చే విధంగా పరిశోధకులు భద్రత, మెడిసిన్ ధరలు,  ఖర్చు వంటి సమస్యలపై పని చేస్తున్నారు. ఎందులకంటే గత కొన్ని ఏళ్ల నుంచి క్యాన్సర్ మందుల ధర కొనుగోలు అతిపెద్ద సవాలుగా మారింది.

ఇవి కూడా చదవండి

క్లినికల్ ట్రయల్ ప్లానింగ్ ప్రారంభం

ఇప్పటికే జంతువులపై చేసిన అధ్యయనం విజయవంతమైందని పరిశోధకులు తెలిపారు. మూడు, నాలుగేళ్లలో ఈ ఔషధాన్ని మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్లినికల్ ట్రయల్ ప్లాన్ చేస్తున్నట్లు కూడా పరిశోధకులు తెలియజేశారు. ఐఐటీ-మద్రాస్‌కు చెందిన ప్రొఫెసర్ ఆర్ నాగరాజన్ మాట్లాడుతూ భారతీయ మసాలా దినుసుల ప్రయోజనాల గురించి శతాబ్దాలుగా మనకు పెద్దలు చెబుతూనే ఉన్నారు. సుగంధ ద్రవ్యాల జీవ లభ్యత వాటి అప్లికేషన్, వినియోగాన్ని పరిమితం చేసింది. నానో-ఎమల్షన్ ఈ అడ్డంకిని సమర్థవంతంగా అధిగమిస్తుంది. నానో-ఎమల్షన్‌ను స్థిరీకరించడం ఒక ముఖ్యమైన అంశం. ఇది ఇప్పుడు తమ ప్రయోగశాలలో పరిష్కరించబడిందని పేర్కొన్నారు.

ప్రయోగశాలలో కొనసాగుతున్న అధ్యయనం

ప్రొఫెసర్ ఆర్ నాగరాజన్ ఇంకా మాట్లాడుతూ క్యాన్సర్ కణాల పరస్పర చర్యలను గుర్తించడానికి అధ్యయనం ముఖ్యమైనదని ఆయన అన్నారు. ఈ అంశాన్ని ప్రయోగశాలలో క్రమం తప్పకుండా అధ్యయనం చేస్తూనే ఉంటామని వెల్లడించారు. విజయవంతమైన జంతు ఫలితాలను వీలైనంత త్వరగా క్లినికల్ ట్రయల్స్‌గా మార్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని పేర్కొన్నారు. రెండు, మూడేళ్లలో ఈ మందులను మార్కెట్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని నాగరాజన్ సి చెప్పారు. అంతేకాదు ఈ ఔషధం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు, చికిత్స ఖర్చు కూడా తగ్గుతుందన్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..