Boosting Memory: మెదడుకు పదును పెట్టాలా.. అయితే ఈ ఆటలు ఆడండి!

| Edited By: Ram Naramaneni

Nov 05, 2023 | 9:50 PM

ప్రస్తుతం అందర్నీ వేధించే సమస్యల్లో అల్జీ మర్స్, మతి మరుపు కూడా ఒకటి. చిన్న చిన్న విషయాలను మర్చిపోతే పర్వేలేదు కానీ.. అదే ఎక్కువ అయితే మాత్రం అల్జీ మర్స్ ఎటాక్ చేసినట్లే. చిన్న విషయాలకు కూడా సరైన నిర్ణయాన్ని తీసుకోలేం. ఇతరులపై ఆధార పడాల్సి ఉంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలకు అయినా చెక్ పెట్టాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. అప్పుడే అందం, ఆరోగ్యం మన సొంతం అవుతాయి. అలాగే నిద్ర కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు బీజీ లైఫ్..

Boosting Memory: మెదడుకు పదును పెట్టాలా.. అయితే ఈ ఆటలు ఆడండి!
Brain
Follow us on

ప్రస్తుతం అందర్నీ వేధించే సమస్యల్లో అల్జీ మర్స్, మతి మరుపు కూడా ఒకటి. చిన్న చిన్న విషయాలను మర్చిపోతే పర్వేలేదు కానీ.. అదే ఎక్కువ అయితే మాత్రం అల్జీ మర్స్ ఎటాక్ చేసినట్లే. చిన్న విషయాలకు కూడా సరైన నిర్ణయాన్ని తీసుకోలేం. ఇతరులపై ఆధార పడాల్సి ఉంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలకు అయినా చెక్ పెట్టాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. అప్పుడే అందం, ఆరోగ్యం మన సొంతం అవుతాయి. అలాగే నిద్ర కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు బీజీ లైఫ్ కారణంగా చాలా మంది స్ట్రెస్ కి గురవుతున్నారు. ముందు దాన్ని కూడా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇలా మన ఆరోగ్యం అనేది ఒకదానికొకటి ముడి పడి ఉంటుంది. కాట్టి వీలైనంత వరకూ అన్ని సరిగ్గా ఉండేలా చేసుకోండి. ఇలా మతిమరపు రాకుండా ఉండాలంటే మెదడుకు పదును పెట్టే వ్యాయామాలు చేయాలి. అప్పుడు బ్రెయిన్ షార్ప్ గా పని చేస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పజిల్స్ ఆడాలి:

ఖాళీగా ఉన్న సమయంలో ఏవో గేమ్స్ పదులు పజిట్స్ ఉన్న ఆటలను ఆడాలి. జిగ్సా పజిల్స్ అనేవి మార్కెట్లో ప్రస్తుతం లభ్యమవుతున్నాయి. వీటిని ఆడటం వల్ల మెదడు యాక్టీవ్ గా ఉంటుంది. దీంతో చేసే పనిపై ఫోకస్ పెరుగుతుంది. దీని వల్ల ఇతర పనులపై కూడా ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే ఎలాంటి పనులను అయినా ఈజీగా, షార్ప్ గా చేయగలిగే శక్తి లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

సొలిటర్ గేమ్స్:

కంప్యూటర్ లో కొన్ని సొలిటర్ కార్డ్ గేమ్స్ ఉంటాయి. అంటే పేకలు తెలుసా కదా.. వాటితో అంకెలు సెట్ చేసే ఆటల్లాంటివి. ఇలాంటి ఆడటం వల్ల మెదడులోని నాడులు ఉత్తేజం అవుతాయి. దీంతో బ్రెయిన్ కి మరింత పదును పెరుగుతుంది. కంప్యూటర్ లో కొన్ని రకాల కార్డ్స్ ని ఆడటం వల్ల బ్రెయిన్ లోని నాడులు షార్ప్ అయ్యాయని పలు పరిశోధనల్లో తేలింది.

సంగీతం – డ్యాన్స్:

సంగీతం – డ్యాన్స్ ఇవి రెండూ మనిషిని ఉత్తేజితులుగా చేస్తుంది. మనకు నచ్చిన కొన్ని రకాల పాటలు వినడం వల్ల.. మనకు తెలియకుండా పాడేస్తూంటారు. అలాగే మరికొన్నింటికి డ్యాన్స్ కూడా చేయాలని పిస్తుంది. అలా మ్యూజిక్ విన్నా.. ఇతరులకు నేర్పించిన మెదడులోని నరాలు చురుగుగా పని చేస్తుంది. అలాగే డ్యాన్స్ లు చేసినా కూడా బ్రెయిన్ యాక్టీవ్ అవుతుంది.

కాగా చిన్న పిల్లలకు.. చిన్నప్పటి నుంచే ఇన్నోవేటీవ్ గా ఆలోచించేలా చేయండి. వారికి పజిల్స్ వంటివి నేర్పించడంలో హెల్ప్ చేయండి. దీని వల్ల వాళ్ల బ్రెయిన్ యాక్టీవ్ అవుతుంది.

గమనిక: ఇవి ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు నిపుణులను సంప్రదించండి.