Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moringa Benefits: ఒక చెంచా మునగాకు పొడితో ఇన్ని లాభాలా..

ఖరీదైన డైట్ లు, ప్రొటీన్ షేక్ లు, డ్రైఫ్రూట్స్ తీసుకోలేకపోయినా పరవాలేదు. మీ శరీరాన్ని పవర్ హౌస్ లా మార్చుకునేందుకు మీ ఆర్థిక స్థితి ఏమాత్రం అడ్డంకి కాదు. అలాంటి ఓ సూపర్ ఫుడ్ గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఒకే ఒక్క చెంచా మునగాకు పొడి మీ శరీరంలో అద్భుతాలు చేయగలదని మీకు తెలుసా?.. దీని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

Moringa Benefits: ఒక చెంచా మునగాకు పొడితో ఇన్ని లాభాలా..
Moringa Benefits
Follow us
Bhavani

|

Updated on: Feb 12, 2025 | 1:03 PM

మునగాకు పొడిని మొరింగా పౌడర్ అని కూడా పిలుస్తారు. మునగ చెట్టు ఆకు నుంచి ఆకులను సేకరించి ఎండబెట్టి పొడిగా మారుస్తారు. దీనిని వివిధ ఆహారాలు, ఔషధాలు, జుట్టు, చర్మ సంరక్షణ ప్రాడక్ట్స్ లోనూ ఉపయోగిస్తారు. దీనిని రోజూ మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. విటమిన్లు ఎ, సి, బి-కాంప్లెక్స్, కాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్, మెగ్నీషియం, రాగి, ఫోలిక్ ఆమ్లం, పిరిడాక్సిన్, నికోటినిక్ ఆమ్లం వంటి పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి.

మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

రక్తపోటును, మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది.

బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

ఎముకలను, దంతాలను బలంగా మార్చుతుంది.

హార్మోన్ అసమతుల్యత ఉన్నవారిలో వీటిని బ్యాలన్స్ చేస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

గుండె సంబంధిత అనారోగ్యాల నుంచి కాపాడుతుంది.

జుట్టు రాలడం, ఉబ్బసం, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి బయటపడేస్తుంది.

మునగాకు కారంతో ఓ ముద్ద..

మునగాకు పొడిని రోజూ ఆహారంలో తీసుకోవచ్చు. కొందరు దీనితో కారం పొడి తయారు చేస్తుంటారు. మొదటి ముద్దలో ఒక చెంచా కారం పొడి వేసుకుని తినడం వల్ల బాడీ తొందరగా వీటిలోని పోషకాలను గ్రహిస్తుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది రామబాణంలో పనిచేస్తుంది.

డీటాక్సిఫికేషన్ డ్రింక్ లా..

మునగాకు పొడితో తయారు చేసే టీని మొరింగా టీగా మార్కెట్లో అమ్ముతుంటారు. బాడీని డీటాక్సిఫై చేసుకునేందుకు ఇది బాగా పనిచేస్తుంది. వేడి నీటిలో చెంచా పొడిని వేసుకుని టీలా తయారు చేసుకోవాలి. అవసరమైతే నిమ్మచెక్క పిండుకోవాలి. ఇధి టాక్సిన్స్ ను బయటకు తోస్తుంది. తినగానే పొట్ట ఉబ్బినట్టుగా ఉన్నా, లివర్ సమస్యలు ఉన్నా ఈ టీ మంచి రెమిడీ. దీనిని కాస్త చల్లార్చి తేనె కూడా కలుపుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది.

మునగాకు నూనెతో ఎన్నో లాభాలు..

మీ చర్మ సమస్యలను చిటికెలో దూరం చేసే శక్తి మునగాకుకు ఉంది. దీనిని నూనెలా తయారు చేసుకుని చర్మానికి రాసుకోవచ్చు. ఇందులో ఉండే విటమిన్ ఎ, సి, ఇ వంటివి వయసును తగ్గించి మచ్చలు, ముడతలను కనపడకుండ చేస్తాయి. రోజూ కొనని చుక్కల మొరింగా నూనెను ముఖం, చేతులు, ఇతర భాగాలకు పట్టించుకోవాలి. ఇది చర్మంలోని ఇన్ ఫ్లమేషన్ ను కూడా తగ్గిస్తుంది.

సప్లిమెంట్స్ రూపంలోనూ..

మునగాకు పొడిని నేరుగా తీసుకునేందుకు ఇష్టపడని వారు వీటిని ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకోవచ్చు. ఇవి మీ ఎనర్జీ లెవెల్స్ ను చక్కగా మెయింటైన్ చేస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)