ఆకుపచ్చ కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే నిపుణులు ఎల్లప్పుడూ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోవాలని సిఫార్సు చేస్తారు. ఇందులో కాకరకాయ ఒకటి. ఇది రుచికి చేదుగా ఉంటుంది. కానీ, ఆరోగ్యపరంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, ఈ చేదు కారణంగానే చాలా మంది కాకరకాయను ఇష్టపడరు. తినరు. అదే సమయంలో దాని విస్తృత ప్రయోజనాల కారణంగా కాకరకాయను తమ ఆహారంలో భాగంగా చేసుకునేవారు కూడా ఉన్నారు. అయితే చేదు కొన్నిసార్లు మీకు హానికరం కూడా కలిగించొచ్చని చెబుతున్నారు నిపుణులు. అవును కాకరకాయతో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. మరి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉంటే కాకరకాయను తినవద్దు. డయాబెటిక్ అయితే కాకరకాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే కాకరకాయ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో చాలా సహాయపడుతుంది. ఒకవేళ రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉంటే.. పొరపాటున కూడా కాకరకాయ తినొద్దు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గే అవకాశం ఉంది. అలాగే, డయాబెటిస్‌లో దాని అధిక వినియోగం హిమోలిటిక్ అనీమియా ప్రమాదాన్ని పెంచుతుంది.
గర్భధారణ సమయంలో కాకరకాయ తినవద్దు. గర్భవతులకు కాకరకాయ హానీతలపెడుతుంది. కాకరకాయలోని మెమోర్చెరిన్ కంటెంట్ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి హానికరం. అటువంటి పరిస్థితిలో, గర్భధారణ సమయంలో కాకరకాయను వీలైనంత తక్కువగా తినడానికి ప్రయత్నించండి.
కాలేయానికి హానికరం. కాలేయం మన శరీరంలో ముఖ్యమైన భాగం. అందుకే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ కాకరకాయ కూర తినడం, కాకరకాయ జ్యూస్ తాగడం చేస్తే.. కాలేయం ఆరోగ్యం దెబ్బతింటుంది. కాకరకాయలోని లెక్టిన్ కాలేయంలో ప్రోటీన్ల పరస్పర చర్యను నిరోధిస్తుంది. ఇది కాలేయ వ్యాధికి దారితీస్తుంది.
కాకరకాయను పదే పదే తీసుకోవడం వల్ల విరేచనాలు వస్తాయి. వాంతి సమస్యను పెంచుతుంది. అందుకే రోజూ కాకరకాయను తినొద్దు.
రోజూ కాకరకాయను తీసుకుంటే కడుపునొప్పి వస్తుంది. అంతే కాదు, కాకరకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా మందికి జ్వరం, తలనొప్పి వస్తుంది. మూత్రపిండాలు సైతం దెబ్బతింటాయి.
ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి