Better Sleeping Tips: మనిషి జీవితంలో నిద్ర ఒక భాగం.. మనిషి సరిగా నిద్రపోకపోతే.. ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సమయం ప్రకారం నిద్రపోతేనే మనిషి మానసిక పరిస్థితి బాగుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. మంచిగా నిద్రించేందుకు ఇలాంటి టిప్స్ పాటిస్తే చాలా మంచిగా నిద్రపడుతుందని పేర్కొంటున్నారు.
ముందుగా ప్రశాంతంగా ఉండేలా మీ బెడ్ రూంలో ఏర్పాట్లు చేసుకోవాలి. బెడ్ షీట్లు, దిండు, బెడ్ రూం లైటింగ్, దుప్పట్లు లాంటివి మీకు అనుకూలంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.
స్లీపింగ్ టైం ప్రణాళికను రూపొందించుకోవాలి. ముఖ్యంగా ఏ టైంలో నిద్రపోవాలి.. ఏ సమయంలో మనం నిద్ర నుంచి మెల్కోవాలి. కనీసం ఎన్ని గంటలపాటు నిద్రించాలి. అనేది ప్రణాళిక ఉండాలి.
Sleeping Benefits
నిద్రపోయే ముందు సిగిరేట్ తాగడం, టీ, కాఫీ తాగకూడదు. కెఫిన్ పదార్థాలు నిద్రను దూరం చేస్తాయని.. సాధ్యమైనంతవరకూ వాటికి దూరంగా ఉండాలని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.
మానసిక ఒత్తిడి నివారణకు వ్యాయామం, యోగా, మెడిటేషన్, ప్రాణాయామం లాంటివి చేయాలి. దీంతో ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా నిద్రపడుతుందని.. ఒకవేళ ఆలోచనలుంటే కుటుంబసభ్యులతో పంచుకుంటే.. ఒత్తిడి దూరమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.