వాము ఆకు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వాము గురించి చాలా మందికి తెలుసు. పూర్వం అయితే వాము ఆకుతో బజ్జీలు వేసేవారు. వాము ఆకులో పోషకాలు చాలా ఎక్కువ. ప్రతి రోజూ భోజనం చేసిన తర్వా వాము ఆకు తింటే చాలా సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో కూడా వాము ఆకును వివిధ అనారోగ్య సమస్యల్ని తగ్గించడానికి ఉపయోగింస్తారు. ముఖ్యంగా వాము ఆకుతో జీర్ణ సమస్యలు దూరం చేసుకోవచ్చు. చిన్న పిల్లలకు కూడా వాము ఆకుతో తయారు చేసిన ఆహారాన్ని ఇవ్వొచ్చు. ఇంకా వాము ఆకుతో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో, లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొటిమలకు చెక్:
ప్రతి రోజూ భోజనం చేసిన తర్వాత వాము ఆకుల్ని నమిలి తినడం వల్ల శరీరంలో హార్మోన్ స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి. దీంతో పింపుల్స్ సమస్యను తగ్గించు కోవచ్చు.
జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది:
వాము ఆకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు.. జుట్టు సమస్యల్ని దూరం చేస్తుంది. అలాగే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా వాము ఆకులు హెల్ప్ చేస్తాయి.
నోరు ఆరోగ్యంగా ఉంటుంది:
ఒక్కొక్కరికి నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇలాంటి వారు అప్పుడప్పుడు వాము ఆకు నమలడం వలన నోటి దుర్వాసన దూరం అవుతుంది. అంతే కాకుండా వాము ఆకును నమలడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా కూడా దూరం అవుతుంది. నోరు రిఫ్రెష్ గా ఉంటుంది. అలాగే నోటిలో బ్లీడింగ్ వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.
జీర్ణ క్రియ సమస్యలకు చెక్ పెట్టవచ్చు:
వాము ఆకును ఆహారంతో తిన్నా లేక భోజనం చేశాక వాము ఆకుల్ని నమిలినా జీర్ణ సమస్యలు అన్నీ పోతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు, మల బద్ధంకంతో ఇబ్బంది పడే వారు వాము ఆకుల్ని తినడం వల్ల ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. దీంతో కడుపులో నొప్పి, కడుపులో ఉబ్బరం, గ్యాస్, అజీర్తి, మల బద్ధకం వంటివి దూరం అవుతాయి.
ఇమ్యూనిటీ లభిస్తుంది:
భోజనం చేసిన తర్వాత వాము ఆకుల్ని నమలడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీని వల్ల బాడీని పలు రకాల ఇన్ ఫెక్షన్లు సోకకుండా కాపాడు కోవచ్చు. అంతే కాకుండా జ్వరం, జలుబు, తల నొప్పి, దగ్గు వంటి సమస్యలు కూడా దూరం చేస్తాయి.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.