Liver Diet: లివర్‌ సమస్యలతో బాధపడుతున్నారా..! అయితే ఒక్క వారం రోజులు ఈ ఆహార నియమాలు పాటించండి..

|

Apr 05, 2021 | 10:29 PM

Best Foods for Liver: మన దైనందిన జీవితంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో మనం శరీరంపై పెద్దగా దృష్టిసారించడం లేదు. ఫలితంగా మనం అనేక వ్యాధుల బారిన పడుతున్నాం. అయితే శరీరంలో

1 / 6
Best Foods for Liver: మన దైనందిన జీవితంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో మనం శరీరంపై పెద్దగా దృష్టిసారించడం లేదు. ఫలితంగా మనం అనేక వ్యాధుల బారిన పడుతున్నాం. అయితే శరీరంలో ముఖ్యమైన పనులు నిర్వహించి ఆరోగ్యవంతంగా ఉంచడంలో కాలేయం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాలేయం చేసే పనులతోనే మనిషి ఆరోగ్యవంతుడిగా ఉంటాడని అధ్యయనంలో సైతం తేలింది.

2 / 6
కాలేయం శరీరంలో అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. రక్తంలో పదార్థాలను ప్రాసెస్ చేయడం కాలేయం ప్రధాన పని. కాలేయం కడుపు, చిన్న ప్రేగులు, ప్లీహము, క్లోమం, పిత్తాశయంతో సహా అవయవాల నుంచి రక్తాన్ని హెపాటిక్ పోర్టల్ సిర ద్వారా పొందుతుంది. అప్పుడు కాలేయం ఫిల్టర్లను ప్రాసెస్ చేస్తూ.. రక్తాన్ని గుండెకు పంపుతుంది.

3 / 6
కాలేయంలో జీర్ణవ్యవస్థ పనితీరు నుంచి రోగనిరోధక శక్తి పెంపొందించడం.. ఎండోక్రైన్ వ్యవస్థ, ఎక్సోక్రైన్ విధులు ఉన్నాయి. కావున అలాంటి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం మన కర్తవ్యం. కావున కాలేయ ఆరోగ్యం కోసం మనం ప్రధానంగా తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలుసుకుందాం.

4 / 6
వెల్లుల్లిలో విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. మ్యాంగనీస్, సెలీనియం, విటమిన్ సి, విటమిన్ బి6, యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంపొందించే గుణాలు ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లి కాలేయాన్ని శుభ్రపరచడంతోపాటు.. ఎంజైమ్స్ ను విడుదల చేసి ఆరోగ్యవంతంగా ఉంచడంలో సాయపడుతుంది.

5 / 6
కాలేయ ఆరోగ్యానికి బీట్ రూట్ కూడా మంచిగా ఉపయోగపడుతుంది. బీట్ రూట్ బీపీని తగ్గించడానికి, జీర్ణక్రియని మెరుగుపరచడానికి, డయాబెటిస్ వ్యాధి నివారణకు తోడ్పాటునందిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది లివర్ క్యాన్సర్ కి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా హిమోగ్లోబిన్ శాతం పెరిగేలా చేస్తుంది.

6 / 6
నిమ్మకాయలు.. వీటిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. మీరు ఆహారంలో నిమ్మకాయలను ఉపయోగించవచ్చు లేదా.. నిమ్మరసంగా కూడా తీసుకోవచ్చు. వీటితో కూడా కాలేయ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.