నువ్వుల నూనె గురించి చాలా మందికి తెలుసు. నువ్వుల నూనె ప్రస్తుతం దీపారాధన కోసమే యూజ్ చేస్తున్నారు కానీ.. పూర్వం నువ్వుల నూనె ముఖ్యంగా బాలింతలకు ఇచ్చేవారు. బలంగా ఉండాలని ఐదు నెలల వరకు బాలింతలకు నువ్వుల నూనెతో వండిన ఆహారాలను అందించేవారు. పండుగలు వచ్చాయంటే నువ్వుల నూనెతో శరీరాన్ని మర్దనా చేసేవారు. జుట్టుకు కూడా ఉపయోగించేవారు. ఇలా చేయడం వల్ల చర్మ సమస్యలు దూరమయ్యేవి. చాలా మంది పచ్చళ్లను కూడా నువ్వుల నూనెతోనే చేస్తారు. నువ్వులు ఎంత ఆరోగ్యమో.. నువ్వుల నూనె కూడా మనకు అంతే విధంగా పని చేస్తాయి.
నువ్వుల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి, ఇ, కాల్షియం, జింక్, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి. దీన్ని ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. పూర్వం నువ్వుల నూనెను ఎక్కువగా తీసుకునే వారు. నువ్వుల నూనెను కేవలం ఆరోగ్యం కోసమే కాదు.. అందం రెట్టింపు చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
1. యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది:
నువ్వుల నూనెను చర్మానికి మర్దనా చేసుకోవడం వల్ల.. యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. ఎలాంటి హాని కలగకుండా చూస్తుంది.
2. నలుపు పోతుంది:
స్నానం చేసే ముందు నువ్వుల నూనెను ముఖానికి, కాళ్లు, చేతులకు రాసుకుని మాసాజ్ చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే నలుపు, మృత కణాలు పోతాయి. రక్త ప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుంది.
3. ఇన్ ఫెక్షన్స్ రావు:
చర్మానికి నువ్వుల నూనె రాసుకోవడం వల్ల ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. నువ్వుల నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.
4. జుట్టు రాలదు:
నువ్వుల నూనెను జుట్టు రాసుకుని తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలకుండా, చిట్లకుండా షైనీగా ఉంటుంది.
5. స్క్రబ్ గా యూజ్ చేయవచ్చు:
నువ్వుల నూనెతో శనగ పిండి, పసుపు కలుపుకుని స్క్రబ్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల బాడీపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్, ట్యాన్ పోతాయి. చర్మం కాంతి వంతంగా తయారవుతుంది.
6. స్కిన్ టోన్ మెరుగు పడుతుంది:
రోజూ నువ్వుల నూనెను మర్దనా చేసుకుని స్నానం చేస్తూ ఉంటే చర్మ ఛాయ కూడా మెరుగు పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.