గులాబీ పువ్వులు ప్రేమకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా..! తెలిస్తే షాక్ అవుతారు..!

గులాబీ పువ్వులు ప్రేమకు చిహ్నంగా అందరికీ తెలుసు. కానీ వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గులాబీ పువ్వుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. వీటిని ఉపయోగించడం వల్ల చర్మపు మచ్చలు, బరువు తగ్గడం, మొటిమలు, ఇన్ఫెక్షన్లు, అలెర్జీ వంటి సమస్యలు తగ్గుతాయి. గులాబీ పువ్వు ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

గులాబీ పువ్వులు ప్రేమకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా..! తెలిస్తే షాక్ అవుతారు..!
Rose Flower Health Benefits

Updated on: Feb 13, 2025 | 10:20 AM

గులాబీ పువ్వులు ప్రేమకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ ఎ, సి, ఇ, ఐరన్, కాల్షియం ఉన్నాయి. గులాబీ పువ్వుల రసం బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. మొటిమల నివారణకు, జీర్ణక్రియ మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది. ఇలా ఆరోగ్య రీత్యా, చర్మ సంరక్షణలో గులాబీ పువ్వులు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి.

అధిక బరువు

చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గడానికి గులాబీ పువ్వులు సహాయపడతాయి. 10 నుంచి 15 గులాబీ రేకులను నీటిలో వేసి నానబెట్టండి. నీరు గులాబీ రంగులోకి మారినప్పుడు దానికి ఒక చెంచా తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపండి. ఈ నీటిని నెల రోజుల పాటు తాగడం వల్ల బరువు తగ్గుతారు.

మొటిమలకు చెక్

గులాబీ పువ్వు మొటిమలను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను తగ్గిస్తాయి. కొన్ని మెంతుల్ని వేయించి, రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడుక్కోండి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి.

జీర్ణక్రియ

గులాబీ రేకులు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది చాలా మంచిది. గులాబీ రేకులు పేగుల కదలికలను వేగవంతం చేస్తాయి. కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. గులాబీ రేకుల్ని శుభ్రపరిచి నేరుగా తినవచ్చు. నీటిలో నానబెట్టి, తేనె, దాల్చిన చెక్క పొడి వేసి తాగొచ్చు.

మానసిక స్థితి

గులాబీ పువ్వులు ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి. గులాబీ రేకుల్ని నీటిలో మరిగించి, ఆవిరిని పీల్చడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

ముడతలు

రోజ్ వాటర్‌ను నాభికి అప్లై చేయడం వల్ల ముఖంపై ముడతలు తగ్గుతాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. రోజ్ వాటర్ ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. గులాబీ పువ్వులు కేవలం ప్రేమకు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిని సరైన పద్ధతిలో ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)