Summer Season: వేసవి వచ్చేసింది.. ఈ సీజన్‌లో మీ గుండెను ప్రభావితం చేసే 5 వ్యాధులు ఇవే.. జర భద్రం!

|

Mar 24, 2022 | 8:36 PM

Summer Season: మారుతున్న వాతావరణం ప్రభావం ప్రజలపై చూపడం ప్రారంభించింది. ఈసారి మార్చి నెల ఎండలు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. మండుతున్న వేడి .. ఎండలు..

Summer Season: వేసవి వచ్చేసింది.. ఈ సీజన్‌లో మీ గుండెను ప్రభావితం చేసే 5 వ్యాధులు ఇవే.. జర భద్రం!
Summer Heat And Heart Attac
Follow us on

Summer Season: మారుతున్న వాతావరణం ప్రభావం ప్రజలపై చూపడం ప్రారంభించింది. ఈసారి మార్చి నెల ఎండలు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. మండుతున్న వేడి .. ఎండలు గుండె రోగుల సమస్యల(Heart Disease) ను పెంచుతాయి. కనుక అధిక వేడిని, ఎండలోకి వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేయాలి. ఈరోజు వేసవిలో నిపుణులు చెప్పిన మీ గుండెను ప్రభావితం చేసే 5 వ్యాధుల గురించి.. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..

 అలసట: వేసవి సీజన్ లో ప్రజలు తరచుగా త్వరగా అలసిపోతారు. అలా తరచుగా అలసిపోతుంటే  జాగ్రత్తగా ఉండండి. ఈ లక్షణం మీ గుండెపై ప్రభావం చూపుతుంది. నిజానికి, కార్డియాక్ అరెస్ట్ కారణంగా, ఒక వ్యక్తి శరీరంలో రక్తం పరిమాణం తగ్గుతుంది.అయితే ప్రజలు వేడి వలన వస్తున్న అలసటగా భావించి విస్మరిస్తారు. అలాంటి పొరపాటు మీరు చేయకండి.. తరచుగా అలసటకు గురైతే  వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

మూర్ఛ: వేసవి కాలంలో చాలా మంది తరచుగా మూర్ఛపోతారు. ఎక్కువ ఎండ, డీ హైడ్రేషన్ వలన ఇలా జరిగిందని అనుకుంటారు. అయితే గుండె రక్తాన్ని ప్రసారాన్ని సరిగా చేయలేని సమయంలో కూడా అపస్మారక స్థితి ఏర్పడుతుంది. కనుక ఈ సమస్యను సకాలంలో పట్టించుకోకపోతే, గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

పార్శ్వపు నొప్పి: పెరుగుతున్న వేడికి మైగ్రేన్ సమస్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం వేడి కాదు. వాస్తవానికి, ఈ సీజన్‌లో, మైగ్రేన్ రోగుల గుండెపై చాలా ఒత్తిడి ఉంటుంది. వేడికి గురికావడం వల్ల గుండెకు సరఫరా చేసే రక్తనాళాల లోపల రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది. ఇది గుండెపోటుకు దారి తీస్తుంది.

ఊబకాయం పెరుగుదల: వేసవి కాలంలో నడుస్తున్నప్పుడు త్వరగా అలసిపోతారు. సూర్యరశ్మి, ఎండవేడి వలన మార్నింగ్ వాక్ చేసే సమయం తగ్గుతుంది. దీంతో శరీరంలో కొవ్వు పెరగడం ప్రారంభమవుతుంది, ఇది నేరుగా గుండెపై ప్రభావం చూపుతుంది. బరువు పెరిగే కొద్దీ మన గుండె పరిమాణం కూడా పెరుగుతుంది. గుండె పరిమాణంలో పెరుగుదల గుండెపోటు లేదా స్ట్రోక్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

డీహైడ్రేషన్‌: వేసవి తాపానికి, వడదెబ్బకు గురవుతారు. ఇక శరీరం నుంచి చెమట రూపంలో నీరు విసర్జింపబడుతుంది. దీంతో తరచుగా డీహైడ్రేషన్‌ (నిర్జలీకరణ)కు గురవుతారు. ఇది ఒకొక్కసారి ప్రాణాంతకం కావచ్చు. ఎండాకాలంలో డీహైడ్రేషన్‌తో బాధపడేవారు గుండెపోటుకు గురవుతారు. అధిక సూర్యకాంతి లేదా వేడిలో ఎక్కువ తిరగడం వలన బీపీ పై ప్రభావము చూపిస్తుంది.

 ఏం చేయాలి ఏమి చేయకూడదు: మీరు ప్రతిరోజూ అలసిపోయినట్లు అనిపిస్తే, నిర్లక్ష్యం చేయకండి, వైద్యుడిని సంప్రదించండి. ఎవరైనా మూర్ఛపోతే, అతనికి బట్టలు విప్పి చల్లదనం కలిగేలా చూడండి.
ఉదయం అల్పాహారం తీసుకోండి. అల్పాహారంలో మొలకెత్తిన ధాన్యాలు తీసుకోండి.
చల్లటి నీటితో స్నానం చేస్తే గుండె జబ్బుల నుంచి దూరంగా ఉండవచ్చు.
హృద్రోగులు వేసవిలో 6-7 లీటర్ల నీరు త్రాగాలి.

హృద్రోగులు అధిక శ్రమకు దూరంగా ఉండాలి.
తలనొప్పి, వికారం, తల తిరగడం, బలహీనత ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు.
చర్మం చల్లగా .. తేమగా ఉంటే, వైద్యుడిని సంప్రదించండి.
పల్స్ వేగంగా ఉంటె వెంటనే డాక్టర్ సలహా తీసుకోండి

వేసవిలో గుండెపోటు రాకుండా యోగా సహకరిస్తుంది: 

యోగా వల్ల ఊబకాయం తగ్గడమే కాకుండా శరీర ఆకృతిని సరిచేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. సూర్య నమస్కారం గుండెకు అత్యంత ప్రభావవంతమైన యోగాగా పరిగణించబడుతుంది. ఇది శరీరం జీవక్రియ రేటును పెంచుతుంది. దీని వల్ల శరీరం నుంచి చెమట ఎక్కువగా విడుదలై ఊబకాయం తగ్గుతుంది.

Note: ఇక్కడ ఇవ్వబడిన సలహాలు సూచనలు పాఠకుల ఆసక్తిని అనుసరించి ఇచ్చినవి.. వైద్య సలహాలు తీసుకొని పాటించాల్సి ఉంటుంది.

Also Read: Viral Video: మూడు చిరుతల మధ్య .. చిరుతను కౌగలించుకుని హాయిగా దుప్పటి కప్పుకుని నిద్రపోతున్న వ్యక్తి

Barley Water: వేసవి తాపాన్ని తీర్చే చౌకైన సహజ పానీయం బార్లీ నీరు.. కిడ్నీ రాళ్లతో బాధపడేవారికి మంచి ఉపశమనం..