
బార్లీలో ఔషధ గుణాలతోపాటు.. ఎన్నో పోషకాలు దాగున్నాయి.. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.. అందుకే.. బార్లీ నీటిని తాగాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి బార్లీ నీళ్లు శరీరానికి శక్తినిచ్చి, వేడిని తగ్గించే ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన పానీయం. దీనిని బార్లీ గింజల నుండి తయారు చేస్తారు. దీనిని బార్లీ రైస్ లేదా బార్లీ జావా అని కూడా పిలుస్తారు. బరువు తగ్గాలనుకునే వారికి, ముఖ్యంగా ఎండాకాలంలో శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుకోవడానికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎండలో బయటికి వెళ్లి వచ్చిన తర్వాత ఈ పానీయం తాగడం చాలా మంచిది.
బార్లీ నీటి (Barley Water) లో యాంటీఆక్సిడెంట్లతోపాటు.. ఫైబర్, విటమిన్లు (విటమిన్ B6), ఖనిజాలు (మాంగనీస్, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్) ఉంటాయి.. ఇందులో కేలరీలు, కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటాయి. బార్లీ నీరు శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇంకా.. బరువు తగ్గడం, రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది.. ఇంకా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
బార్లీ నీళ్లు తయారుచేయడానికి, ముందుగా 2 టేబుల్ స్పూన్ల బార్లీ గింజలను శుభ్రమైన నీటితో కడగాలి. తరువాత, ఒక గిన్నెలో 1 లీటరు నీటిని తీసుకొని, శుభ్రం చేసిన బార్లీ గింజలను అందులో వేయాలి. లేదంటే.. బార్లీ పొడిని కూడా ఉపయోగించవచ్చు.. స్టవ్ ఆన్ చేసి, మీడియం ఫ్లేమ్‌లో బార్లీ గింజలు బాగా మెత్తగా ఉడికే వరకు మరిగించాలి. గింజలు ఉడికి, లావుగా మారడం, నీటి రంగు మారడం, మంచి వాసన రావడం పర్ఫెక్ట్ తయారీకి సూచనలు.. ఈ ప్రక్రియలో బార్లీలో ఉన్న పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి. ఆ తర్వాత తగినంత ఉప్పు లేదా నిమ్మరసం కలుపుకుని లేదా అలానే బార్లీ నీటిని తాగవచ్చు.. రోజుకు 1-2 గ్లాసుల బార్లీ నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.
పరగడుపున బార్లీ నీళ్లు తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన ఫైబర్‌ను అందిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ది బెస్ట్ రెసిపీగా చెప్పబడుతుంది. వాంతులు అవుతున్నప్పుడు, శరీరం డీహైడ్రేట్‌గా ఉన్నప్పుడు బార్లీ నీళ్లు తాగడం వలన తక్షణ ఉపశమనం లభిస్తుంది. కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చు. ఈ పానీయం తాగినప్పుడు చాలా ఉపశమనంగా, సురక్షితంగా ఉంటుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..