Banana For Control BP: బీపీ ఉన్న వారు అరటిపండు తినడం మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..

|

Apr 27, 2022 | 9:51 AM

Banana For Control BP: అరటిపండ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండు మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే అరటిపండు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందా..?

Banana For Control BP: బీపీ ఉన్న వారు అరటిపండు తినడం మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..
Banana
Follow us on

Banana For Control BP: అరటిపండ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండు మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే అరటిపండు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందా..? లేదా..? అనే విషయం తరచూ అందరి నుంచి ప్రశ్న వస్తుంటుంది. వాస్తవానికి అరటిపండులో పొటాషియం, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. దీని వినియోగం వల్ల బీపీ అదుపులో ఉండడమే కాకుండా ఎముకలు కూడా దృఢంగా మారుతాయి. అధిక రక్తపోటు ఉన్నవారు దీనిని తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అరటిపండును వేసవిలో శక్తికి ప్రధాన వనరుగా కూడా పరిగణిస్తారు. అందుకే కొంతమంది అరటిపండ్లను రోజూ తినడానికి ఇష్టపడతారు. మరి అరటిపండ్లు తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • బ్రేక్ ఫాస్ట్ మానేస్తే.. అరటిపండు తినండి: అరటిపండులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తింటే పొట్ట త్వరగా నిండుతుంది. ఆఫీస్ లేదా కాలేజీకి వెళ్లే క్రమంలో ఉదయం వేళ బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నట్లయితే.. అరటిపండు తిన్న తర్వాత బయటకు వెళ్లండి. ఎందుకంటే అరటిపండు తినడం తక్షణ శక్తిని ఇస్తుంది.
  • ఒత్తిడి తగ్గుతుంది: ఒత్తిడిని తగ్గించడంలో అరటిపండు కూడా చాలా మేలు చేస్తుంది. వాస్తవానికి అరటిపండ్లలో ట్రిప్టోఫాన్ అనే మూలకం ఉంటుంది. ఈ ట్రిప్టోఫాన్ వల్ల మన శరీరంలో సెరోటోనిన్ తయారవుతుంది. సెరోటోనిన్‌ని హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు. ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది.
  • జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి: జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను దూరం చేయడంలో కూడా అరటిపండు చాలా మేలు చేస్తుంది. అరటిపండులో ఉండే స్టార్చ్ మన జీర్ణవ్యవస్థకు ముఖ్యమైన బ్యాక్టీరియాకు మేలు చేస్తుంది. అరటిపండ్లు యాంటి యాసిడ్ గా పరిగణిస్తారు. కావున మీకు గుండెల్లో మంట సమస్య ఉంటే అరటిపండు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
  • ఎముకలు బలంగా ఉంటాయి: ఎముకలు దృఢంగా ఉండేందుకు అరటిపండును కూడా తీసుకోవాలి. 30 సంవత్సరాల వయస్సులో కూడా చాలా మంది ఎముకలలో నొప్పి, పగుళ్ల గురించి ఫిర్యాదు చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు ప్రతిరోజూ ఒక అరటిపండు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

Also Read:

Apple Cider Vinegar: యాపిల్ సైడర్ వెనిగర్‌తో బోలెడన్ని ప్రయోజనాలు.. ఎలా ఉపయోగించాలంటే..?

Cashew Benefits: జీడిపప్పు అందుకే తినాలంటారు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..