
శరీర శక్తి: అశ్వగంధను రోజూ తీసుకోవడం వల్ల శక్తి మరింత ఉత్పన్నమై రోజంతా శరీరం చురుకుగా ఉంటుంది. విశేషమేమిటంటే.. ఈ ఔషధ మూలికలో సహజసిద్ధమైన గుణాల వల్ల ఎలాంటి హాని కలగదు.

జ్ఞాపకశక్తి: అశ్వగంధ ప్రత్యేకత ఏమిటంటే.. దాని సహాయంతో జ్ఞాపకశక్తిని మరింత పదును పెట్టవచ్చు. నిపుణుల సలహా మేరకు పిల్లలు రోజూ తినేలా ప్లాన్ చేయండి. అలా చేయడం ద్వారా వారు చదువులో ఏకాగ్రత సాధించగలుగుతారు.

బరువు తగ్గవచ్చు: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వ్యక్తులు అశ్వగంధను తమ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. ఇది జీవక్రియను పెంచడంతోపాటు.. కొవ్వును కరిగిస్తుంది.

ఒత్తిడి నుంచి ఉపశమనం: బిజీ షెడ్యూల్, పోటీతత్వం కారణంగా ప్రజలు తరచుగా ఒత్తిడికి గురవుతారు. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి రోజూ అశ్వగంధను సరైన మోతాదులో తీసుకుంటే మేలని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు.

నోటిలో అల్సర్లను నివారిస్తుంది: మనం తీసుకునే ఆహారం కారణంగా.. నోటిలో బొబ్బలు, నొటి అల్సర్లు ఏర్పడతాయి. అవి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో.. మీరు అశ్వగంధ తీసుకోవడం మంచిది. దీనిద్వారా నోటిలోని అల్సర్లను వీలైనంత త్వరగా తగ్గించుకోవచ్చు.