Child Care: మీ పిల్లలు ఏం తింటున్నారో తెలుసా..? వారికి ఎలాంటి ఆహారం పెట్టాలంటే..!

|

Jan 29, 2022 | 9:36 PM

ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంలో తిండికి కూడా పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేని పరిస్థితులు నెలకొన్నాయి...

Child Care: మీ పిల్లలు ఏం తింటున్నారో తెలుసా..? వారికి ఎలాంటి ఆహారం పెట్టాలంటే..!
Food (1)
Follow us on

ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంలో తిండికి కూడా పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేని పరిస్థితులు నెలకొన్నాయి. పిల్లలు తల్లిదండ్రులతో కలిసి కూర్చుని తినడం చాలా వరకు తగ్గిపోయింది. ఒకవేళ తింటున్నా టీవీ చూస్తూనో.. మొబైల్‌తోనో గడుపుతున్నారు. ఈ స్థితిలో తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకోవడం అనేది తగ్గిపోయింది. ఆరోగ్యకరమైన పదార్థాలను తీసుకోవడం లేదని వారిని మందలించడం కంటే.. ఆ దిశగా అసలు తాము ఏరకమైన ప్రయత్నాలు చేశామనే కోణంలో పెద్దలు ఆలోచించాలని నిపుణులు చెబుతున్నారు. చిన్నతనం నుంచి మంచి ఆహారపు అలవాటు చేస్తే.. అది వారి భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందని పేర్కొంటున్నారు.

ఆహారపు అలవాట్లలో పరిణామ క్రమాలుంటాయి. శిశువు పుట్టిన మొదటి ఆర్నెల్లలో తల్లి ఆహారపు అలవాట్లే తొలుత అత్యంత కీలకమవుతాయని నిపుణులు చెబుతున్నారు. బాలింత రుచులు పాల ద్వారా శిశువుకు చేరతాయి. తల్లి ఎన్ని ఎక్కువ రకాల ఆహారాలను తింటే.. శిశువుకు కూడా తల్లి పాల ద్వారా అన్ని రుచులు తెలుస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఘన రూపంలో ఆయా పదార్థాలను ఇచ్చినప్పుడు వ్యతిరేకత లేకుండా వాటి రుచులను ఆస్వాదించడానికి అవకాశాలెక్కువ. ఇది ఒక రకంగా ఆహారపు అలవాట్లలో తొలి పరిణామ క్రమం.

ఆదర్శంగా నిలవాల్సింది పెద్దలేపెద్దవారు కంచం ముందు కూర్చొని.. కొన్ని ఆహారాలను పక్కనబెట్టేసి.. ‘నాకు నచ్చట్లేదు..నేను తినను’ అని మాట్లాడుతుంటే పిల్లలూ అనుసరిస్తారు. అది తినకూడదేమో.. మంచిది కాదేమో.. బాగుండదేమో అని భావించే అవకాశాలున్నాయి. అందుకే తినేటప్పుడు తల్లిదండ్రులు ఆహారాల గురించి ఏం మాట్లాడుతున్నారు? ఎలా ప్రవర్తిస్తున్నారనేది చాలా ముఖ్యమైన అంశం. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకూ కుటుంబమంతా కలిసి తినడం మంచి అలవాటు. టీవీ లోకంలో పడితే ఎక్కువ తినేసే ప్రమాదంతింటున్న సమయంలో పిల్లల్ని ఎందుకూ పనికిరావని తిట్టడమూ, వారి చదువు గురించి మాట్లాడడమూ.. చేయకూడదు. ఒత్తిడి పెంచకూడదు.

అలా చేస్తే ఎప్పుడెప్పుడు అక్కణ్నుంచి వెళ్లిపోదామా అనే ధోరణి వారిలో పెరుగుతుంది. అలా కాకుండా వారి అలవాట్లను శ్రద్ధగా పరిశీలించాలి. తద్వారా ఏం తింటున్నారు? ఏమి తినలేకపోతున్నారు? కారణాలేమిటో తెలుస్తుంది. సినిమా, టీవీ చూస్తూ ఆహార పదార్థాలను తినడాన్ని పూర్తిగా మానేయాలి. ఎందుకంటే అలా తింటున్నప్పుడు కడుపు నిండిందా? లేదా? అనేది గమనించకుండా ఎక్కువగా తీసుకునే ప్రమాదం ఉంటుంది. బరువు పెరుగుతారు. ఇవన్నీ పెద్దవారు చేయకుండా ఉంటే.. చిన్నపిల్లలూ పాటిస్తారు.

Read Also.. Wake Up Early: పిల్లలు పొద్దున్నే నిద్రలేవడానికి బద్దకిస్తున్నారా.. అయితే పెద్దవారు ఈ విషయాలను తెలుసుకోవలిసిందే..