Health Tips: మీరు శాకాహారులా? ప్రోటీన్ లోపానికి ఇలా చెక్ పెట్టండి..!

|

Jul 24, 2022 | 7:06 AM

Health Tips: ప్రొటీన్ లోపంతో బాధపడేవారికి కోడి గుడ్డు వంటి పోషకాలు కలిగిన ఆహారాలను తినాలని వైద్యులు సలహాలు ఇస్తుంటారు.

Health Tips: మీరు శాకాహారులా? ప్రోటీన్ లోపానికి ఇలా చెక్ పెట్టండి..!
Protein Food
Follow us on

Health Tips: ప్రొటీన్ లోపంతో బాధపడేవారికి కోడి గుడ్డు వంటి పోషకాలు కలిగిన ఆహారాలను తినాలని వైద్యులు సలహాలు ఇస్తుంటారు. ఎందుకంటే.. మాంసాహారంలో ప్రొటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే శాకాహారం తినడం వల్ల శరీరంలో ప్రోటీన్ లోపాన్ని అధిగమించలేమని దీని అర్థం కాదు. మన శరీరానికి శక్తిని అందించడానికి ప్రోటీన్ పనిచేస్తుంది. మన రోజువారీ ఆహారంలో ప్రోటీన్ అవసరం. తద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే మాంసం తినని శాకాహారుల శరీరంలో ప్రొటీన్ల కొరతను తీర్చడానికి ఏయే ప్రత్యేక ఆహారాలను తీసుకోవాలో ఇవ్వాల తెలుసుకుందాం.

రోజూ ఎంత ప్రొటీన్ తీసుకోవాలి..
ప్రొటీన్ శరీరానికి ప్రధాన బిల్డింగ్ బ్లాక్. సగటున, ఒక వ్యక్తికి కిలోగ్రాము శరీర బరువుకు 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరం. సరళంగా చెప్పాలంటే సగటున పురుషుడికి 56 గ్రాముల ప్రోటీన్ అవసరం. స్త్రీకి 46 గ్రాముల ప్రోటీన్ అవసరం. కానీ స్త్రీ గర్భవతి అయితే, పాలిచ్చే తల్లి లేదా అథ్లెట్ అయితే ఎక్కువ ప్రోటీన్ అవసరం. ప్రతి రోజూ భోజనంతో ప్రోటీన్ తీసుకోవాల్సిందే.

కాయధాన్యాలు..
ఆహారంలో ప్రోటీన్ అవసరాన్ని తీర్చడానికి కాయధాన్యాలు బెటర్ అని చెప్పొచ్చు. ప్రోటీన్ లోపాన్ని తీర్చడానికి వీటిని వండుకుని తినాలి. అరకప్పు వండిన పప్పులో 12 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.

పనీర్..
శాకాహారులకు పనీర్ సూపర్ ఫుడ్ అని చెప్పాలి. పనీర్ ప్రోటీన్స్‌కు గని వంటిది. పనీర్ ను స్నాక్స్‌గా కూడా తీసుకోవచ్చు.

ఓట్స్..
అరకప్పు ఓట్స్‌లో 6 గ్రాముల ప్రొటీన్, 4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇందులో మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్, ఫోలేట్ కూడా ఉంటాయి. ఇందులో అధిక నాణ్యత గల ప్రోటీన్ ఉంటుంది.

క్వినోవా..
క్వినోవాలో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. మొత్తం తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. కండరాల అభివృద్ధికి, రోగనిరోధక శక్తి పెంపుదలకు అమైనో ఆమ్లాలు అవసరం. క్వినోవాను సలాడ్, వెజిటబుల్ బర్గర్ మొదలైన వాటిలో కలుపుకుని తినవచ్చు.

చియా విత్తనాలు..
అర కప్పు చియా గింజల్లో 6 గ్రాముల ప్రోటీన్, 13 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇందులో ఇనుము, కాల్షియం, సెలీనియం, మెగ్నీషియం ఉంటుంది. అంతే కాకుండా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..