Back Pain Relief Tips: వెన్ను నొప్పి వేధిస్తుందా? ఈ సింపుల్ టిప్స్ తో ఈజీగా చెక్ పెట్టండి..

| Edited By: Anil kumar poka

Jan 20, 2023 | 9:02 PM

వెన్నునొప్పి సంబంధిత సమస్యలను దూరంగా ఉంచడానికి పని గంటల మధ్య విరామం తీసుకోవాలని, కొంచెం చుట్టూ తిరగాలని ఆరోగ్య నిపుణులు తరచుగా సూచిస్తున్నారు. అలాగే కొన్ని తేలికపాటి వ్యాయాయాలు చేసినా వెన్ను నొప్పి సమస్య నుంచి బయటపడవచ్చని పేర్కొంటున్నారు.

Back Pain Relief Tips: వెన్ను నొప్పి వేధిస్తుందా? ఈ సింపుల్ టిప్స్ తో ఈజీగా చెక్ పెట్టండి..
Back Pain
Follow us on

మారుతున్న జీవన శైలి కారణంగా వివిధ వయసుల వారిని వెన్నునొప్పి సాధారణంగా వేధిస్తుంది. కంప్యూటర్ వద్దే ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం లేదా తప్పుగా కూర్చోవడం వల్ల సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. వెన్నునొప్పి సంబంధిత సమస్యలను దూరంగా ఉంచడానికి పని గంటల మధ్య విరామం తీసుకోవాలని, కొంచెం చుట్టూ తిరగాలని ఆరోగ్య నిపుణులు తరచుగా సూచిస్తున్నారు. అలాగే కొన్ని తేలికపాటి వ్యాయాయాలు చేసినా వెన్ను నొప్పి సమస్య నుంచి బయటపడవచ్చని పేర్కొంటున్నారు. వెన్ను నొప్పిని తగ్గించుకోడానికి సూపర్ టిప్స్ ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

ప్లాంక్

నేలపై మీ చేతులు ఉంచి మోకాళ్ల వెనక్కి చాపాలి. అనంతరం మీ మోకాళ్ళను నేల తాకకుండా పాదాలతో పైకి లేవాలి. మీ పాదాలు దగ్గరగా ఉంచడం వల్ల వ్యాయామం మరింత సవాలుగా మారుతుంది. అలాగే మీ భుజాలు, చీలమండలను కలిపే రేఖను సృష్టించాలి. ఇలా వీలైనంత సేపు ఉంటే వెన్ను నొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు.

కోర్ బలోపేతం

వ్యాయామాల్లో కోర్ ను బలపరిచే వ్యాయాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిపుణులు మాత్రం ఓ వ్యాయామన్ని వెన్ను నొప్పిని తగ్గించే సాధనంగా సూచిస్తున్నారు. ముందుగా వెనుక భాగాన్ని నిటారుగా ఉంచాలి. అనంతరం మోకాళ్లను మడవాలి. అనంతరం పాదాల సపోర్ట్ తో శరీరాన్ని పైకి ఎత్తాలి. ఇలా వీలైనంత సేపు ఉండాలి. ఇలా చేయడం వల్ల వెన్ను నొప్పి నయం అవుతుంది.

ఇవి కూడా చదవండి

హిప్ స్ట్రెచ్చింగ్

వెన్ను నొప్పి సమస్య నుంచి బయటపడడానికి హిప్ స్ట్రెచ్చింగ్ వ్యాయామం ఓ సాధనంగా పని చేస్తుంది. ముందుగా నేలపై పడుకోవాలి. అనంతరం మోకాళ్లను పైకి లేపాలి. అనంతరం ఓ మోకాలిని చాపుతూ కాళ్లను సాగదీయాలి. అనంతరం వేరే మోకాలితో కూడా ఇలానే చేయాలి. ఈ వ్యాయామం హిప్ కండరాలను తెరిచి వెన్ను నొప్పి సమస్యను దూరం చేస్తుంది. 

గ్లూట్ ల బలోపేతం

ముందుగా నేలపై పడుకోవాలి. అనంతరం మీ మోకాళ్ళను వంచి, మీ పాదాలను మీ సీటుకు దగ్గరగా తీసుకురావాలి. మీరు మీ మడమలను తాకగలిగినప్పుడు మీ పాదాలకు సరైన దూరం ఉంటుంది, కానీ మీరు మీ చీలమండను పట్టుకోలేరు. ఉచ్ఛ్వాస సమయంలో, మీ పాదాలను నేలపైకి నెట్టి, మీ తుంటిని ఎత్తండి. మీ భుజాలు నేలపై ఉన్నాయని నిర్ధారించుకోండి. లిఫ్ట్‌ను ఎలివేట్ చేయడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. 

మరిన్ని హెల్త్ వార్తల కోసం  క్లిక్ చేయండి