
చుండ్రు అనేది జుట్టుకు సంబంధించిన సమస్య. ఈ మధ్యకాలంలో చాలా మంది యువతి యువకులు చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కానీ మీరు చుండ్రు సమస్య నుంచి బయట పడేందుకు ఆముదంను ఉపయోగించవచ్చు. చర్మం పొడిబారడం, దురద నుంచి ఉపశమనానికి ఆముదం నూనెను ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఫంగల్ గుణాల వల్ల స్కాల్‌లోని pHని సరిగ్గా ఉంచుతుంది. అయితే మీరు కూడా చుండ్రుతో బాధపడుతున్నట్లయితే.. మీరు ఆముదం నూనెను ఉపయోగించండి. మీరు చుండ్రుని ఎలా వదిలించుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..
చుండ్రు సమస్యకు చెక్ పెట్టాలంటే..
అల్లం రసంతో ఆముదం-
జుట్టు సమస్యలకు అల్లం రసంతో చాలా సమస్యలకు చెక్ పెట్టొచ్చు. జట్టుకు పట్టుకునే ధూళి, రసాయనాలతోపాటు చుండ్రును కూడా తొలిగించుకోవచ్చు. దీని కోసం, మీరు రెండు చెంచాల ఆముదం , అల్లం రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడగాలి. మీరు దీన్ని వారానికి 3 సార్లు చేయాలి. ఇలా చేస్తే చుండ్రు సమస్య నుంచి వెంటనే బయటపడవచ్చు.
కొబ్బరి నూనె, ఆముదం, గుడ్లతో..
కొబ్బరి నూనెలో అధిక ప్రొటీన్లు ఉంటాయి. ఇది చుండ్రును తొలగించడంలో సహాయపడుతుంది. గుడ్డు మీ జుట్టుకు పోషణనిస్తుంది. దీని కారణంగా జుట్టు మృదువుగా.. మెరిసిపోతాయి. ఈ మూడింటిని మిక్స్ చేయడం ద్వారా మీ జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. ఈ పేస్ట్‌ను మీ జుట్టుకు 30 నిమిషాల పాటు అప్లై చేసి.. ఆపై షాంపూతో మీ జుట్టును కడగాలి.
ఆముదం, అర్గాన్ ఆయిల్..
ఆముదం, ఆర్గాన్ నూనెను ఉపయోగించి మీరు చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు. అర్గాన్ ఆయిల్ మీ జుట్టును మెరిసేలా, మృదువుగా చేస్తుంది.. కాబట్టి మీరు దీన్ని వారానికి 3 సార్లు ఉపయోగించవచ్చు.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..