Blood Pressure Patients: ఆధునిక కాలంలో రక్తపోటు సమస్య సర్వసాధారణంగా మారింది. యువకుల నుంచి వృద్ధుల వరకు చాలామందిలో బీపీ సమస్య కనిపిస్తుంది. కొంతమందికి బ్లడ్ ప్రెజర్ బాగా తగ్గిపోతే, మరికొంతమందికి హైబీపీ సమస్య వేధిస్తోంది. ఆరోగ్య పరంగా చూస్తే.. ఈ రెండు కూడా పెద్ద సమస్యలు. తక్కువ బీపీ ఉన్నప్పుడు (Low BP) శరీర భాగాలకు సరైన రక్త సరఫరా జరగదు.. దీని కారణంగా కొన్నిసార్లు అపస్మారక స్థితిలోకి వెళ్లే అవకాశముంటుంది. అదే సమయంలో అధిక BP ని సైలెంట్ కిల్లర్ అంటారు. హై బిపి గుండెపోటుకు ప్రధాన కారణాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది కాకుండా అధిక బిపి కారణంగా స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యలు కూడా సంభవించవచ్చు.
ఈ రోజుల్లో ప్రతి వ్యాధి గురించిన సమాచారం సోషల్ మీడియాలో లభిస్తోంది. దీని కారణంగా చాలామంది రక్తపోటు గురించి అనేక అపోహలకు గురవుతున్నారు. ఈ పరిస్థితి వారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తుంది. అటువంటి కొన్ని అపోహల వాస్తవాన్ని ఇక్కడ తెలుసుకోండి. తద్వారా మీరు భవిష్యత్తులో ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా.. మిమ్మల్ని మీరు సులభంగా రక్షించుకోవచ్చు.
తక్కువ ఉప్పుతో అధిక రక్తపోటు నియంత్రణ
ఉప్పు తక్కువగా తినడం వల్ల అధిక బీపీ నియంత్రణకు దారితీస్తుందనే సాధారణ నమ్మకం సాధారణంగా కనిపిస్తుంది. ఆరోగ్య పరంగా ఉప్పు ఎక్కువగా తినడం మంచిది కాదు. అధిక బీపీ ఉన్నవారికి ఎక్కువ ఉప్పు హానికరం అనేది నిజం. కానీ కేవలం ఉప్పు తగ్గించడం వల్ల మీ హైబీపీకి పరిష్కారం కాదు. తక్కువ ఉప్పు తినడంతో పాటు, మీరు మీ జీవనశైలిని కూడా మార్చుకోవాలి అప్పుడే ఈ సమస్యను నియంత్రించవచ్చు.
కోపం వచ్చినప్పుడు బీపీ పెరుగుతుంది
కోపం వల్ల బీపీ పెరుగుతుందని కొందరి అభిప్రాయం. కానీ వైద్య శాస్త్రం తప్పుగా పేర్కొంటోంది. కోపం వచ్చినప్పుడు బీపీ పెరగదు. కోపం – BP మధ్య ఎటువంటి సంబంధాన్ని వైద్య శాస్త్రం గుర్తించలేదు. అధిక బీపీకి ఒత్తిడి ప్రధాన కారణమని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. నేటి కాలంలో యువతలో అధిక బీపీ సమస్య పెరిగిపోయింది. వారిపై పనిభారం ఎక్కువగా ఉండడంతో వారు తరచూ ఒత్తిడికి గురవుతున్నారు. కాబట్టి ముందుగా ఒత్తిడిని నియంత్రించుకోవడం మంచిది.
బీపీ తక్కువగా ఉన్నవారు కాఫీ తాగాలి
బీపీ తక్కువగా ఉన్నవారు కాఫీ తాగాలని, అది రక్తపోటును మెయింటెయిన్ చేస్తుందని చెబుతుంటారు. కానీ ఇది అబద్దం.. కాఫీలో కెఫీన్ ఉంటుంది, ఇది మీ శరీరంలో అనేక సమస్యలను పెంచుతుంది. అయితే, మీకు బీపీ తక్కువగా ఉన్నప్పుడు మీరు కాఫీ తాగవచ్చు, కానీ ఈ కారణంగా కాఫీని మీ అలవాటులో భాగం చేసుకోకండి. ఇది రక్తపోటుకు చికిత్స కాదు. హై బీపీ ఉన్నవారు కాఫీకి పూర్తిగా దూరంగా ఉండాలి.
తక్కువ రక్తపోటు ప్రమాదకరమైనది కాదు
తక్కువ రక్తపోటు ప్రమాదకరం కాదని చాలా మంది అంటుంటారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. సాధారణ సందర్భాల్లో, తక్కువ రక్తపోటు ఖచ్చితంగా పెద్ద సమస్య కాదు. కానీ బాధిత వ్యక్తి ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నట్లయితే, రక్తపోటు అతని జీవితాన్ని ప్రమాదంలో పడేస్తుంది. గర్భధారణ సందర్భంలో తక్కువ బిపి, అధిక బిపి రెండూ ప్రమాదకరమైనవి.
Also Read: