
పండ్లు, కూరగాయలు మన బాడీకి చాలా ఇంపార్టెంట్. వాటిలో దానిమ్మ రసం చాలా స్పెషల్. రక్తహీనతతో బాధపడేవారికి ఇది ఒక మంచి ఔషధంలా పని చేస్తుంది. దానిమ్మ రసంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఐరన్, విటమిన్ సి, పొటాషియం, ఫాస్పరస్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ న్యూట్రియెంట్స్ మన శరీరానికి చాలా రకాలుగా హెల్ప్ చేస్తాయి.
దానిమ్మ రసంలో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. రెడ్ బ్లడ్ సెల్స్ పెరిగి రక్తహీనత తగ్గుతుంది.
దానిమ్మ రసంలోని పోషకాలు హార్ట్‌ను హెల్తీగా ఉంచుతాయి. దీన్ని రెగ్యులర్‌గా తాగితే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి.
ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ ఇంప్రూవ్ అవుతుంది. మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం లాంటి సమస్యలు తగ్గుతాయి. కడుపు క్లీన్‌గా, హెల్తీగా ఉంటుంది.
హై బీపీ ఉన్నవారికి దానిమ్మ రసం చాలా మంచిది. ఇది రక్తనాళాలు సరిగా పనిచేసేలా చేస్తుంది.
విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. స్కిన్‌ను లోపల నుంచి పోషించి స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. యాంటీఆక్సిడెంట్లు స్కిన్‌ను గ్లో అయ్యేలా, హెల్తీగా ఉంచుతాయి.
దానిమ్మ రసం బాడీలోని ఫ్యాట్‌ను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. దీని వల్ల బరువు తగ్గవచ్చు. ఇలా దానిమ్మ రసాన్ని రోజూ తాగడం హెల్త్‌కు చాలా మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)