Cabbage Water Benefits: రోజూ క్యాబేజీ ఉడకబెట్టిన నీరు తాగడం వలన ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో..

Cabbage Water Benefits: కాయగూరల్లో క్యాబేజీ(Cabbage) అతి శ్రేష్టమైంది. ఇది మధ్యధరా సముద్ర ప్రాంతంలో 100వ సంవత్సర ప్రాంతంలో పుట్టింది. కాబేజీ మొక్కలో ఆకులతో పువ్వులా ఉన్న భాగాన్ని మాత్రమే..

Cabbage Water Benefits: రోజూ క్యాబేజీ ఉడకబెట్టిన నీరు తాగడం వలన ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో..
Benefits Of Drinking Cabbage Water

Updated on: Jan 22, 2022 | 11:05 AM

Cabbage Water Benefits: కాయగూరల్లో క్యాబేజీ(Cabbage) అతి శ్రేష్టమైంది. ఇది మధ్యధరా సముద్ర ప్రాంతంలో 100వ సంవత్సర ప్రాంతంలో పుట్టింది. కాబేజీ మొక్కలో ఆకులతో పువ్వులా ఉన్న భాగాన్ని మాత్రమే తింటారు. ఈ క్యాబేజీని చైనా, జపాన్, కొరియా వంటి ప్రాంతాల్లో పచ్చిగా, ఉడకబెట్టి లేదా ఊరబెట్టి అనేక వంటకాలలో ఉపయోగిస్తారు. అయితే చాలా మంది క్యాబేజీ నుంచి వచ్చే వాసన నచ్చక తినడానికి ఇష్టపడరు. అయితే క్యాబేజీ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రక్తములో చెక్కెరస్థాయి సమతుల్యము చేస్తుంది . శరీరములో కొవ్వు నిల్వలు పేరుకు పోకుండాచేస్తుంది. అయితే క్యాబేజీని తినడం ఇష్టం లేకపోతే.. కనీసం క్యాబేజీని ఉడక బెట్టుకొని ఆ నీటిని తాగినా చాలు.. అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. క్యాబేజీని తినకపోతే.. ఎన్నో పోషకాలను కోల్పోయినట్లే లెక్క. ఈరోజు క్యాబేజీ ఉడకబెట్టిన నీరు రోజూ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకొందాం..!!

*క్యాన్సర్‌ను నిరోధించటంలో ఇది క్రియాశీలకంగా పనిచేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.
*క్యాబేజీ నీటి ద్వారా శరీరానికి అవసరమైన “ప్లేవనాయిడ్స్” సమృద్ధిగా అందుతాయి.
*క్యాబేజీ నీరు తాగడం వల్ల దృష్టి సమస్యలు తీరి.. కంటి చూపు మొరుగుపడుతుంది.
* రోజూ తాగడం వల్ల చర్మం కాంతివంతంగా.. మృదువుగా మారడమే కాదు.. చర్మంపై ఉన్న మచ్చలు నివారింపబడతాయి.
*అధికంగా కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం లు కలిగిన క్యాబేజీ నీరు తాగడం వల్ల ఎముకలకు బలం చేకూరి దృఢంగా మారతాయి.
*అల్సర్ తో బాధపడేవారు.. ఈ నీరు తాగితే.. జీర్ణాశయంలో.. పేగుల్లో పుండ్లు ఏర్పడకుండా నివారిస్తుంది.
* రక్తం శుధ్ధి అవుతుంది.. సరఫరా మెరుగుపడుతుంది.. రక్తహీనతను తగ్గిస్తుంది.
*ఆల్కహాల్ సేవించడం వల్ల కలిగే దుష్పరిమానాలను ఈ నీరు తగ్గిస్తుంది.
* శరీరంలో పేర్కోన్న వ్యర్ధాలను తొలగించి లివర్ ను శుభ్రం చేస్తుంది. లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది.
* క్యాబేజీ నీరు రోజూ తాగడం వల్ల శరీరంలో అధిక కొవ్వుని కరిగిస్తుంది. అధిక బరువు తగ్గుతుంది..
* క్యాబేజీ నీరు రోజూ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ ఫెక్షన్లు దూరం చేస్తుంది.
*ఈ నీరు రొజూ తాగడం వలన బాక్టీరీయా, వైరస్ ల వల్ల వ్యాధులనుంచి.. విష జ్వరాల నుంచి రక్షణ లభిస్తుంది.

Note: ఈ ఆరోగ్య చిట్కాలు కొంతమంది పోషకాహార నిపుణుల సూచనలు అనుసరించి ఇస్తున్నవి.. పాటించే ముందు శరీర తత్వాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read:  ఏపిలోని స్కూల్స్ పై కరోనా పంజా.. ఒకే స్కూల్ లో 147 మందికి కోవిడ్ పాజిటివ్‌