అలాంటి వారికి వరం ఈ ఆకులు.. పరగడుపున జస్ట్ 10 తింటే చాలు.. ఇక తిరుగుండదంతే..

|

Oct 15, 2024 | 5:40 AM

కరివేపాకులో పోషకాలతో పాటు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.. ప్రతిరోజూ కరివేపాకు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.. కరివేపాకులో యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్, హిపటో ప్రొటెక్టివ్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

అలాంటి వారికి వరం ఈ ఆకులు.. పరగడుపున జస్ట్ 10 తింటే చాలు.. ఇక తిరుగుండదంతే..
Curry Leaves
Follow us on

కరివేపాకులో పోషకాలతో పాటు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.. ప్రతిరోజూ కరివేపాకు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.. కరివేపాకులో యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్, హిపటో ప్రొటెక్టివ్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం, గాయాలను నయం చేయడంతోపాటు జుట్టు – చర్మ ఆరోగ్యం మెరుగుపడతాయి. వాస్తవానికి కరివేపాకు సుగంధభరితమైనవి.. కరివేపాకు ఆకులను వంట రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు.. వీటితో వంటకాల రుచితోపాటు సువాసన పెరుగుతుంది.

ఈ ఆకులో ఉండే అన్ని పోషకాలు మీ మొత్తం ఆరోగ్యాన్ని చాలా వరకు మెరుగుపరుస్తాయి. ప్రతి ఒక్కరి వంటగదిలో లభించే కరివేపాకు.. కేవలం ఆహార రుచిని పెంచడానికి మాత్రమే కాకుండా.. ఆరోగ్యాన్ని కాపాడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

కరివేపాకులో ఎన్నో పోషకాలు

కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్ వంటి మంచి పోషకాలు ఉన్నాయి. ఇది మీ ఆరోగ్యాన్ని బలంగా ఉంచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. అయితే, ఉత్తమ ఫలితాలను పొందడానికి కరివేపాకులను సరైన మోతాదులో.. సరైన పద్ధతిలో తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు… దీని వల్ల ఇమ్యూనిటీ పెరగడంతోపాటు ఇన్ఫెక్షన్స్ దూరమవుతాయి.

పరగడుపున తీసుకుంటే వరమే..

డైలీ పరగడపున కొన్ని కరివేపాకు ఆకులను నమలి తినడం లేదా.. కరివేపాకు ఆకు నీటిని లేదా రసం తాగడం వల్ల వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.. మీరు మధుమేహం వంటి సైలెంట్ కిల్లర్ వ్యాధితో బాధపడుతున్నట్లయితే ఈ ఆకును మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం ఈ ఆకులను తీసుకోవడం ఆరోగ్యానికి వరమేనని పేర్కొంటున్నారు.

మధుమేహం నిర్వహణలో ఉపయోగపడుతుంది..

ఉదయం కేవలం 10 కరివేపాకు ఆకులను నమలి తినాలి.. ప్రతిరోజూ ఈ నియమాన్ని పాటిస్తే మధుమేహాన్ని సులభంగా నియంత్రించుకోవచ్చు. అంతేకాకుండా, కరివేపాకులో ఉండే పదార్థాలు మీ పేగు ఆరోగ్యాన్ని చాలా వరకు మెరుగుపరుస్తాయి. కరివేపాకు విరేచనాలు, వాంతులు నివారించడంలో మంచిగా పనిచేస్తాయి.

నోటి ఆరోగ్యానికి మంచిది..

మీరు నోటి దుర్వాసన సమస్య నుంచి బయటపడాలంటే 2-4 కరివేపాకులను నమలి తినండి.. అంతే కాదు, కరివేపాకు కషాయాలతో పుక్కిలించడం వల్ల మీ నోటి ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది. ప్రతిరోజూ ఉదయం ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు రసం తాగడం వల్ల అజీర్ణం నుండి బయటపడవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి