Butter Milk: వేసవిలో పెరుగు కంటే మజ్జిగ ఆరోగ్యానికి మేలు..మజ్జిగను భూలోక అమృతం అంటారు ఎందుకో తెలుసా..

|

Apr 03, 2022 | 9:18 AM

Butter Milk: వేసవి కాలం(Summer Season) వచ్చిందంటే చాలు.. శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. డీహైడ్రేషన్ (Dehydration) కు, అలసటకు గురవుతారు. దీంతో తక్షణ శక్తి కోసం చాలా మంది శీతలలానీయాల వైపు దృష్టి..

Butter Milk: వేసవిలో పెరుగు కంటే మజ్జిగ ఆరోగ్యానికి మేలు..మజ్జిగను భూలోక అమృతం అంటారు ఎందుకో తెలుసా..
Butter Milk
Follow us on

Butter Milk: వేసవి కాలం(Summer Season) వచ్చిందంటే చాలు.. శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. డీహైడ్రేషన్ (Dehydration) కు, అలసటకు గురవుతారు. దీంతో తక్షణ శక్తి కోసం చాలా మంది శీతలలానీయాల వైపు దృష్టి సారిస్తారు. అయితే కూల్ డ్రింక్స్ కంటే.. సహజ పానీయాలు కొబ్బరి నీరు, మజ్జిగ, బార్లీ, చెరకు రసం వంటివి దాహార్తిని తీర్చడమే కాదు.. తక్షణ శక్తిని కూడా ఇస్తాయి. మజ్జిగను వేసవి కాలంలో ఎక్కువుగా తీసుకోవాలి. దేవలోకంలో దేవతల కోసం అమృతాన్నీ, భూమి మీద మానవుల కోసం మజ్జిగనీ భగవంతుడు సృష్టించాడని పెద్దలు వ్యాఖ్యానిస్తారు. అంటే.. మజ్జిగలో అమృతంతో సమజనమైన ఔషధ గుణాలున్నాయని.. మజ్జిగను తాగేవారికి ఎటువంటి వ్యాధులూ కలగవని.. వచ్చిన వ్యాధులు తగ్గుతాయని.. మళ్ళీ తిరిగి తలెత్తకుండా ఉంటాయని… విషదోషాలు, దుర్బలత్వం, చర్మరోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు, కొవ్వు, అమిత వేడి తగ్గుతాయని, శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందని యోగరత్నాకరంలో ఉంది.

మజ్జిగలో ఉపయోకరమైన బాక్టీరియా:
పాలు సమీకృత ఆహారం.. అయితే పాలను తోడు పెట్టి పెరుగు.. ఆ పెరుగుని చిలికి మజ్జిగ చేస్తారు. అయితే పాలను తోడుపెట్టినందు వలన పాలలో ఉండే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిలంగా ఉంటాయి. అంతేకాదు అదనంగా లాక్టో బాసిల్లై అనే మంచి బాక్టీరియా శరీరానికి లభ్యమవుతుంది. ఈ ఉపయోగకారక బాక్టీరియా పాలల్లో ఉండదు.

వేసవిలో మజ్జిగ తాగడం వలన కలిగే ప్రయోజనాలు:

  1. *వేసవి కాలంలో పెరుగు కంటే మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మజ్జిగలో విటమిన్ ఎ, బి, సి, ఇ , కె ఉన్నాయి. వేడికి చెమట అధికంగా బయటకు విసర్జింప బడుతుంది. కనుక వేసవిలో మజ్జిగ తరచుగా తీసుకోవడంతో శరీరంలోని పోషకాల లోపాన్ని తీరుస్తుంది.
  2. *వేసవి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా సహాయం చేస్తుంది.
  3. *రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు మజ్జిగ తీసుకోవడం చాలా అవసరం. ఇందులోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, కార్బోహైడ్రేట్లు , లాక్టోస్ శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
  4. *వేసవిలో మజ్జిగ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది
  5. * అజీర్తితో బాధపడేవారికి మంచి మెడిసిన్ మజ్జిగ. మజ్జిగలో శరీరంలో పేగుల పెరుగుదలను ప్రోత్సహించే ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి అజీర్తి సమస్యను నివారిస్తాయి.
  6. * మజ్జిగ తరచుగా తాగడం వలన అసిడిటీ నుండి ఉపశమనం లభిస్తుంది.
  7. *అసిడిటీ సమస్యతో ఇబ్బంది పడేవారు భోజనం చేసిన అనంతరం మజ్జిగ తీసుకోవడం మంచిది. కడుపులో మంట నుండి కూడా ఉపశమనం ఇస్తుంది.
  8. *స్పైసీ ఫుడ్ తిని కడుపు ఉబ్బారంతో ఇబ్బంది పడేవారికి మజ్జిగ మంచిది. ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల మసాలా ప్రభావాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు కడుపులో మంటను తగ్గిస్తుంది.

 

Also Read: Health Tips: మోకాళ్లు, కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్‌తో ఇబ్బంది పడుతున్నారా.. బెస్ట్ మెడిసిన్ ఈ ఆకుల రసం