పసుపు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీంతో ఎన్నో ఇన్ ఫెక్షన్లు, వ్యాధులు, అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అందుకే నిత్యం మన ఆహార పదార్థాల్లో పసుపును ఉపయోగిస్తూ ఉంటాం. పసుపుల రోగ నిరోధక శక్తి ఎక్కువ. ఇది వివిధ రకాల వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది. ఆయుర్వేదంలో కూడా దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే నల్ల పసుపు పొడి గురించి మీకు తెలుసా.. అసలు ఎప్పుడైనా చూశారా? ఇందులో కూడా అనేకమైన ఔషధ విలువలు ఉన్నాయి.
మామూలు పసుపుతో పోలిస్తే.. నల్ల పసుపును తీసుకోవడం వల్ల భిన్నమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ బ్లాక్ టర్మరిక్ లో కర్క్యుమిన్ లెవల్స్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. ఇది మామూలు దుకాణాల్లోనూ, ఆన్ లైన్ లో కూడా అందుబాటులో ఉంది. మరి ఈ నల్ల పసుపు పొడితో ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మం ఆరోగ్యంగా ఉంటుంది:
నల్ల పసుపు పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది బాడీలో ఉండే ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి.. స్కిన్ ని రక్షిస్తాయి. ముఖంపై వచ్చే మొటిమలు, గుల్లల్లాంటి వాటిని తగ్గిస్తుంది. ముఖానికి వేసుకునే ప్యాక్స్ లో కొద్దిగా ఈ బ్లాక్ పసుపును కలిపి వేసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి.
గాయాలను త్వరగా తగ్గిస్తుంది:
పసుపును ఫస్ట్ ఎయిడ్ గా వాడతారు. గాయాలు, దెబ్బలు తగిలినప్పుడు అక్కడ పసుపును పెడతారు. ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గాయాన్ని త్వరగా నయం చేసేలా పని చేస్తుంది. ఈ నల్ల పసుపు పొడిలో కూడా యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు మెండుగా ఉన్నాయి. ఇది గాయాలను, దెబ్బలను, వాపులను త్వరగా తగ్గిస్తుంది. అర్థరైటీస్ అలాంటి వ్యాధులు తగ్గిపోతాయి.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:
నల్ల పసుపు పొడిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఇతర అనారోగ్య సమస్యలు, ఇన్ ఫెక్షన్లు వంటివి రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.
శ్వాస కోశ సమస్యల్ని తగ్గిస్తుంది:
శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో కూడా నల్ల పసుపు బాగా మేలు చేస్తుంది. జలుబు, దగ్గు, ఆస్తమా, ఉబ్బసం మొదలైన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా చలి కాలంలో నల్ల పసుపు వాడటం చాలా మంచిది.
అలాగే జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా, తల నొప్పి రాకుండా చూడటంలో నల్ల పసుపు బాగా సహాయ పడుతుంది.
గమనిక: ఇవి ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు నిపుణులను సంప్రదించండి.