
Aloe Veera
కలబంద వాడకం ఎవరికి మంచిది కాదు..? చాలా మంది కలబంద జెల్ ఆరోగ్యానికి మంచిదని భావించి ముఖానికి లేదా శరీరానికి వాడుతుంటారు. కానీ కొన్ని రకాల చర్మాలకు ఇది అస్సలు సరిపోదు. కొందరికి ఇది హాని కూడా చేయవచ్చు. ఈ విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరు వాడకూడదు..?
- సున్నితమైన చర్మం ఉన్నవారు.. మీ చర్మం చాలా సున్నితంగా ఉంటే కలబంద వాడకంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. దీనిలోని కొన్ని పదార్థాలు దురద, ఎర్రబారడం, మంట లేదా దద్దుర్లు కలిగించవచ్చు. కాబట్టి ముఖానికి వాడే ముందు చేతికి కొద్దిగా రాసి 24 గంటలు ఆగాలి. ఎటువంటి సమస్య రాకపోతేనే వాడాలి.
- పొడి చర్మం ఉన్నవారు.. పొడి చర్మం ఉన్నవారు కలబందను నేరుగా వాడకపోవడం మంచిది. ఇది మీ చర్మంలో ఉన్న సహజ తేమను తొలగించి మరింత పొడిగా చేస్తుంది. ఒకవేళ వాడాలని అనుకుంటే కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఏదైనా మాయిశ్చరైజర్‌తో కలిపి వాడాలి.
- మొటిమలు ఉన్నవారు.. ఇప్పటికే ముఖంపై మొటిమలు ఉంటే కలబంద వాడకం వల్ల అవి ఇంకా పెరగవచ్చు. కాబట్టి మొటిమల సమస్య ఉన్నవారు సొంతంగా కలబందను వాడకుండా డాక్టర్ లేదా చర్మ నిపుణుల సలహా తీసుకోవాలి.
- గాయాలు, ఇన్ఫెక్షన్లు ఉన్నవారు.. మీ చర్మంపై కట్ అయిన గాయాలు, కాలిన గాయాలు లేదా ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు కలబందను వాడకూడదు. ఇది గాయాన్ని మరింత ఇబ్బంది పెట్టడమే కాకుండా ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. గాయం పూర్తిగా తగ్గిన తర్వాతే వాడాలి.
- మీకు సాధారణ చర్మం ఉంటే కలబంద వాడకం సురక్షితమే. కానీ పైన చెప్పిన సమస్యలలో ఏదైనా మీకు ఉంటే దానిని వాడకపోవడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)