Health Tips: 30 ఏళ్ల తర్వాత మహిళల్లో ఎదురయ్యే సాధారణ సమస్యలు..నిర్లక్ష్యం చేయొద్దు..

|

Nov 10, 2022 | 9:38 AM

శరీరంలోని హార్మోన్ల మార్పులు జీర్ణక్రియ నుండి పోషకాలను గ్రహించడం వరకు ప్రతిదానిని ప్రభావితం చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు ఆహారం విషయంలో కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అనారోగ్యానికి గురికావడం ఖాయం.

Health Tips: 30 ఏళ్ల తర్వాత మహిళల్లో ఎదురయ్యే సాధారణ సమస్యలు..నిర్లక్ష్యం చేయొద్దు..
Leg Pain
Follow us on

పురుషుల కంటే మహిళల జీవితంలో ఆరోగ్య సంబంధిత సవాళ్లు ఎక్కువ. దీనికి ప్రధాన కారణం మహిళల్లో హార్మోన్ల మార్పులు. వయస్సు పెరిగేకొద్దీ స్త్రీల శరీరంలో హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. కానీ, ఋతుస్రావం ప్రారంభమైన తర్వాత, ప్రతి నెలలో హార్మోన్ల మార్పులు కూడా జరుగుతాయి. ఈ కారణంగా మహిళలు తరచుగా బలహీనమైన రోగనిరోధక శక్తి, పోషకాహార లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఎందుకంటే శరీరంలోని హార్మోన్ల మార్పులు జీర్ణక్రియ నుండి పోషకాలను గ్రహించడం వరకు ప్రతిదానిని ప్రభావితం చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు ఆహారం విషయంలో కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అనారోగ్యానికి గురికావడం ఖాయం. ఇప్పుడు మహిళల జీవితంలో మరో ట్విస్ట్ వచ్చింది.

చాలామంది మహిళలు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వరు. వారికి, వారి భర్త ఆరోగ్యం,పిల్లలు, కుటుంబం, ఉద్యోగం, ఇతర గృహ బాధ్యతల తర్వాతే ప్రధాన్యతనిస్తుంటారు.. కానీ, ఈ వైఖరి మహిళల జీవితంలో చాలా ఆరోగ్య సవాళ్లను పెంచుతుంది. అలాంటి సమస్య పాదాల నొప్పి, కండరాల నొప్పి వేధిస్తుంది. కండరాల నొప్పికి నిర్దిష్ట కారణం లేదు. ఎందుకంటే ఇది వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. కానీ ఈ సమస్యకు కారణమని భావించే ప్రధాన ప్రాంతాల గురించి మీరు తెలుసుకోవాలి.

1. శరీరంలో కాల్షియం లేకపోవడం.. 30ఏళ్ల తర్వాత మహిళల శరీరంలో కాల్షియం లోపం ప్రారంభమవుతుంది. ఇది సహజమైన అంశం..అందువల్ల ఏ సందర్భంలోనూ విస్మరించబడదు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి…కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవాలి. శరీరానికి కాల్షియం, ఇతర పోషకాలను అందించే అటువంటి వస్తువులను ఆహారంలో చేర్చుకోవాలి.

ఇవి కూడా చదవండి

2. విటమిన్-డి లోపం శరీరంలో కాల్షియం లోపం ఉన్నప్పుడు, విటమిన్-డి స్థాయి ఆటోమేటిక్‌గా పడిపోతుంది. కాల్షియం లేకుండా శరీరం విటమిన్ డి ని గ్రహించదు.. నిర్వహించదు.. కాబట్టి ఇది జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో కండరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. దాని మొదటి ప్రభావం వెన్నునొప్పి, కండరాల నొప్పి రూపంలో వస్తుంది.

3. విటమిన్-బి12 లోపం కాళ్ల నొప్పులకు మరో ప్రధాన కారణం.. శరీరంలో విటమిన్-బి12 లోపం అని తెలిస్తే..మీరు బి కాంప్లెక్స్‌ తీసుకోవాలి. అయితే దీని కోసం మీ శరీరంలో కాల్షియం లోపమా, విటమిన్-డి లోపమా లేక విటమిన్-బి12 లోపం వల్ల సమస్య వచ్చిందా అనేది తెలుసుకోవాలి. అందుకోసం ముందుగా మీరు డాక్టర్‌ని సంప్రదించాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి