ప్రస్తుత యుగంలో ప్రతీది కల్తీగా మారింది. ముఖ్యంగా మార్కెట్లో దొరికే కూరగాయలు, దుకాణాల్లో దొరికే కిరాణ సామగ్రిని మనం పైపైన చూసి కొనుగోలు చేస్తుంటాం. అయితే మన కళ్లు మనల్ని మోసం చేయొచ్చు. చూడటానికి బాగానే ఉన్నా.. ఆ వస్తువుల్లో ప్రమాదకరమైన రసాయనాలు ఉండొచ్చు. అన్ని ఆహార పదార్థాలూ కల్తీ బారిన పడుతున్న నేపథ్యంలో.. వాటిని కొనే ముందు జాగ్రత్తగా పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కొనేవి మంచివేవో, కల్తీవేవో తెలుసుకొనేది ఎలా అంటారా? ఇది తెలుసుకునేందుకే భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఓ సింపుల్ టిప్స్‌ను షేర్ చేసింది. వివిధ ఆహార పదార్థాల్లో కల్తీని ఎలా గుర్తించాలో వివరించింది. కూరగాయల్లో మలకైట్ గ్రీన్!వస్త్ర పరిశ్రమలో రంగులు అద్దేందుకు ఉపయోగించే మలకైట్ గ్రీన్ ఆనవాళ్లు కూరగాయల్లో కనిపిస్తున్నాయి. మిరపకాయలు, బఠానీలు, బచ్చలి కూర వంటివి ఆకుపచ్చగా, ఆకర్షణనీయంగా కనిపించేలా దీన్ని వాడతారు. అయితే, ఈ మలకైట్ గ్రీన్ ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.
నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. సమయం, ఉష్ణోగ్రత తదితర కారణాలను బట్టి ఈ మలకైట్గ్రీన్.. ప్రమాదకరంగా మారుతుంది. ఇది శరీరంలోకి వెళ్తే శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. పిండం సరిగా పెరగకపోవడం, క్రోమోజోములు దెబ్బతినడం వంటివి జరుగుతాయి. ఈ నేపథ్యంలో కల్తీపై అవగాహన కల్పించడానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ ట్విట్టర్ వేదికగా పలు సూచనలు చేసింది.
Detecting malachite green adulteration in green vegetable with liquid paraffin.#DetectingFoodAdulterants_1@MIB_India@PIB_India @mygovindia @MoHFW_INDIA pic.twitter.com/knomeEnbmA
— FSSAI (@fssaiindia) August 18, 2021
Read Also.. Health Tips: తిన్న తర్వాత ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. ఎందుకో తెలుసుకోండి..