Addasaram Herbal Plant: ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర తృణధాన్యాలు మనం రెగ్యులర్ గా తీసుకునే ఆహారంతో పాటు తీసుకుంటే.. శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి. ఇలా ప్రకృతిలో లభించే జీవన విధానమే ఉత్తమమైందని పకృతి వైద్యుల నమ్మకం. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు, శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ప్రకృతి మనకు అనేక ఔషధగుణాలున్న మొక్కలను వరంగా మనకు ఇచ్చింది. అలంటి అత్యంత విలువైన మూలిక మొక్కలో ఒకటి అడ్డసరం. ఈ మొక్కను మలబార్ నట్ ట్రీ, అడూస అని కూడా పిలుస్తారు. ఆయుర్వేదంలో ఈ చెట్టుని ఔషదాల తయారీకి ఉపయోగిస్తారు. ఈ చెట్టుని అనేక రకాలుగా పరిశీలించిన మన ప్రాచీన శాస్త్రవేత్తలు దీని సర్వాంగాలు తిరుగులేని విధంగా పనిచేస్తాయని తెలిపారు. ఈ చెట్టు గురించి తెలిసిన వ్యక్తి గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో అనేక రోగాలు తరిమి కొట్టొచ్చు అని ఒక సామెత. దీని ఆకులు, పుష్పాలు, వేర్లు, బెరడును ఔషధాల్లో విరివిగా వాడతారు. అడ్డసరం మొక్కలో వాసిసిన్, అఢతోడిక్ ఆమ్లం, సుగంధ తైలం ఉంటాయి. దీని వేర్లు, ఆకులు చేదుగా ఉంటాయి. ఇవి శరీరం లోని వాత, పిత్త, కఫ సంబంధమైన సర్వ వ్యాధులను సంహారం చేయగలవు. ముఖ్యంగా పైత్యం, శీతపైత్యం, రక్తపైత్యం, శ్లేష్మం, దగ్గు, మేహం, క్షయరోగం, కుష్టు రోగం, మొదలయిన అనేక వ్యాధులను ఈ చెట్టు చరమ గీతం పాడుతుంది. ఈరోజు అడ్డసరం యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
*బొల్లి వ్యాధి ఉన్నవారు (పాండు వ్యాధి) అడ్డసరపు ఆకులు 10 గ్రా, ధనియాలు 10 గ్రా, కరక్కాయల బెరడు 10గ్రా, కలిపి నలగ్గోటి అరలీటరు మంచినీటిలో వేసి రాత్రి నుండి ఉదయం వడపోసుకొని ఆ నీటిలో ఒక చెంచా కండ చక్కర పొడి కలిపి పరగడుపున త్రాగుతుంటే ఈ వ్యాధి తగ్గుతుంది.
*అన్ని రకాల కామెర్ల రోగాలకు అడ్డసరం మంది ఔషధం. అడ్డరసం ఆకుని కడిగి దంచి తీసిన రసం 15 గ్రా , మంచి పట్టు తెనే 20 గ్రా , కలిపి మొతాదుగా మూడుపూటలా ఇస్తూ ఉంటే యే విధమైన కామెర్ల వ్యాధి అయినా 7 నుండి 10 రొజుల్లొ తగ్గిపోతాయి.
*ఉబ్బసానికి అడ్డసరం ఆకులు , వేర్లపై ఉండే బెరడు ఈ రెండింటిని కలిపి పొడికొట్టి నిలువ ఉంచుకొవాలి. ఈ పొడిని పొగతాగే చిలుము గొట్టంలో పోసి అంటించి ఆ పొగని పీలుస్తూ ఉంటే క్రమంగా ఉబ్బస వ్యాధి తగ్గుతుంది.
*పొడవైన, ఒత్తైన జట్టు కోసం అడ్డసరం మంచి మేలు చేస్తుంది. అడ్డసరం ఆకులు దంచి తీసిన రసం రెండు కిలోల త్రిఫలాలు దంచి తీసిన రసం అరకిలో, నువ్వుల నూనె 2 కిలోలు కలిపి చిన్న మంటపైన పదార్ధాలు అన్ని ఇగిరిపొయి నూనె మిగిలే వరకు మరిగించాలి. తరువాత దానిని చల్లార్చి గాజు సీసాలో నిలువ ఉంచుకొవాలి. ఈ తైలాన్ని రోజు తలకి రాసుకుంటూ ఉంటే మెదడుకు బలం కలగటమే కాకుండా తలలోని చుండ్రు, పుండ్లు , గుల్లలు, దురదలు తగ్గిపోతాయి. అంతేకాదు తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి.
*క్షయ దగ్గు కు అడ్డసరపు ఆకు మంది మెడిసిన్. అడ్డసరం ఆకు రసం 20 గ్రా , తేనే 5 గ్రా కలిపి ఒక మొతాదుగా రెండుపూటలా రోజు సేవిస్తూ ఉంటే క్రమంగా క్షయ దగ్గు పూర్తిగా పోతుంది .
*అన్ని రకాల శ్లేష్మ రోగాలకు అడ్డసరపు ఉపయోగపడుతుంది. ఆకు 20 గ్రా , అల్లపు రసం 20 గ్రా కలిపి రెండు పుటాల మూడు రోజుల పాటు తాగుతూ ఉంటే గొంతులో అడ్డుపడే కఫమంత కరిగి పడిపోయి శ్లేష్మ సమస్యనుంచి ఉపశమనం లభిస్తుంది.
*దురదలు ఇబ్బంది పడుతుంటే.. అడ్డసరపాకు , పసుపు సమంగా తీసుకొని తగినంత గోముత్రంతో మెత్తగా నూరి దురదల పైన పట్టించి అది బాగా ఆరిపొయిన తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తుంటే దురదలు, దద్దుర్లు ఖచ్చితంగా తగ్గిపోతాయి .
*అడ్డసరం పుష్పాలను సుఖవ్యాధుల నివారణ కు వాడతారు.
*ఈ మొక్కలోని అన్నిభాగాలు నులి పురుగులను నివారిస్తాయి. ఉబ్బసం ఉపశమానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
*అడ్డసరం ఆకుల కషాయం రోజుకు మూడుసార్లు సేవిస్తే రక్త విరేచనాలు, వాంతిలో రక్తం పడడటం, మొండి జ్వరాలు తగ్గుతాయి.
గోరువెచ్చని ఆకు కషాయం చర్మానికి పూస్తే తామర, దురద, గజ్జి, దద్దుర్లు తదితర చర్మవ్యాధులు తగ్గుతాయి.
అనేక రకాల రోగాలకు అడ్డసరి లేహ్యం
తయారీ విధానం : ఒక కిలో అడ్డసరపు ఆకులను నలగగొట్టి 8 కిలోల మంచినీటిలో వేసి 2 కిలోల కషాయం మిగిలే వరకు దించి వడపోసుకోవాలి . ఈ కషాయంలో పటిక బెల్లం పొడి కిలో, కరక్కాయ బెరడు పొడి 640 గ్రా కలిపి చిన్న మంటపైన వండాలి. ఆ పదార్ధం పాకానికి వచ్చిన తరువాత అందులో తవాక్షరి చూర్ణం 40 గ్రా , దాల్చిన చెక్క పొడి 10 గ్రా , పిప్పిళ్ళ పొడి 20 గ్రా , ఆకుపత్రి పొడి 10 గ్రా , యాలుకల పొడి 10 గ్రా , నాగకేసరాల పొడి 10 గ్రా వేసి బాగా కలియదిప్పాలి. పాత్రను దించి చల్లర్చిన తరువాత అందులొ 80 గ్రా తేనే కలపాలి. అంతే అడ్డసరపు లేహ్యం రెడీ.
వాడే విధానం: -పూటకు 5 గ్రా మొతాదుగా రెండు పూటలా తిని ఒక కప్పు పాలు తాగాలి.
Also Read:
మరోసారి మంచి మనసు చాటుకున్న బాలకృష్ణ.. చిన్నారి క్యాన్సర్ పేషేంట్ కు చికిత్స కోసం ఆర్ధిక సాయం
Kidnapping the Bride: ఆ దీవిలో జరిగేవన్నీ రాక్షస వివాహాలే.. నచ్చిన యువతిని కిడ్నప్ చేసిమరీ పెళ్లి చేసుకునే యువకులు..