Tulsi Seeds for Health: తులసి ఆకులే కాదు గింజలు కూడా ప్రయోజనకరమే.. అవేమిటో తెలిస్తే జీవితంలో వదిలిపెట్టరు..

|

Jan 20, 2023 | 2:01 PM

సనాతన ధర్మ సంస్కృతిలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్కను దైవంతో సమానంగా కొలుస్తారు భారతీయులు. దైవరూపంగా పూజలందుకునే తులసి మొక్క ఆరోగ్యానికి కూడా..

Tulsi Seeds for Health: తులసి ఆకులే కాదు గింజలు కూడా ప్రయోజనకరమే.. అవేమిటో తెలిస్తే జీవితంలో వదిలిపెట్టరు..
Tulsi Seeds And Leaves For Health
Follow us on

సనాతన ధర్మ సంస్కృతిలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్కను దైవంతో సమానంగా కొలుస్తారు భారతీయులు. దైవరూపంగా పూజలందుకునే తులసి మొక్క ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఖాళీ కడుపుతో తులసి ఆకులను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. తులసి మొక్కలో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగున్నాయి. అందుకే ఆయుర్వేదంలో కూడా తులసిని దివ్యౌషధంగా పేర్కొంటారు. అందుకే ప్రతిరోజూ ఉదయం తులసి ఆకులు తింటే.. పలు సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. తులసి ఆకులను తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన, జలుబు, జీర్ణక్రియ, ఉదర సంబంధిత సమస్యలు దూరమవుతాయని వారు పేర్కొంటున్నారు.

అయితే తులసి ఆకులతోనే కాక గింజలతో కూడా అనేక ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. మన ఆరోగ్యాన్ని కాపాడడంలో తులసి గింజలు కూడా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇప్పటి తరాలకు తులసి ప్రయోజనాలు తెలియకపోవచ్చు కానీ మన పూర్వీకులకు, పెద్దలకు బాగా తెలుసు. అందుకే నిత్యం తులసి మొక్కను పూజిస్తూ, ప్రదక్షిణలు చేస్తుంటారు. తులసి మొక్కల వాసన కూడా మన ఆరోగ్యానికి ప్రయోజనకరమే. తులసి గింజలలో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. మరి తులసి గింజలతో ఉన్న ఉపయోగాలేమిటో మనం ఇప్పుడు చూద్దాం..

  1. తులసి గింజలతో మానసిక ఒత్తిడిని జయించవచ్చు. డిప్రెషన్ లేదా స్ట్రెస్‌తో బాధపడుతుంటే.. తులసి గింజల్ని నానబెట్టి క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
  2. ఇవి కూడా చదవండి
  3. అజీర్తి, ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉన్నవారు.. తులసి గింజల్ని నీళ్లలో నానబెట్టి వాటితో సహా నీటిని తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్ సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
  4. మన ఆరోగ్యాన్ని కాపాడడంలో రోగ నిరోధక శక్తికి ప్రాధాన్యత ఎప్పుడూ ఉంటుంది. చాలా రోగాల నుంచి మనల్ని కాపాడేది ఇదే. కరోనా వైరస్ సమయంలో కూడా ఇమ్యూనిటీ కీలకపాత్ర పోషించింది. తులసి గింజలను నిత్యం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్‌ను మెరుగపరచవచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..