
మనిషి ఆరోగ్యంగా ఉండడంలో ఆహారానిది ఎంత ముఖ్య పాత్రో నీటిది కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందని తెలిసిందే. ప్రతిరోజూ శరీరానికి సరిపడ నీరు అందకపోతే ఎన్నో నష్టాలు ఉంటాయి. కాలంతో, దాహంతో సంబంధం లేకుండా నీటిని తాగాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే చాలా మంది దాహం వేస్తే మాత్రమే నీటిని తాగుతుంటారు. శరీరానికి సరిపడ నీరు అందకపోతే డీహైడ్రేషన్ బారిన పడతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
శరీరం డీహైడ్రేషన్ బారిన పడితే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి తగినంత నీరు లభించకపోతే శరీరంలో కీలక అవయవాలైన కాలేయం, కండరాలు, కీళ్లు వంటి వాటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇవన్నీ మనకు తెలిసిందే. అయితే సరిపడ నీరు తాగకపోతే శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయే ప్రమాదం కూడా ఉంటుందని మీకు తెలుసా.? అవును నిపుణులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. డీహైడ్రేషన్ కారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ నీటికి కొలెస్ట్రాల్ సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం..
శరీరంలో నీటి శాతం తగ్గితే చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల మోతాదులు పెరుగుతాయి. నీటి శాతం తగ్గిపోతే కాలేయం రక్తంలోకి ఎక్కువగా కొలెస్ట్రాల్ ని విడుదల చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రక్తంలో ఉండే కొలెస్ట్రాల్‌ను తొలగించే ప్రక్రియ సైతం నెమ్మదిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ స్థాయిలో అనూహ్యంగా పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. రక్త నాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కాబట్టి గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే నీరు తాగాల్సిందేనని చెబుతున్నారు. నీరు ఎక్కువగా తాగితే, కొలెస్ట్రాల్ తక్కువగా రక్తంలోకి విడుదలవుతుందని చెబుతున్నారు. కాబట్టి నీరు తాగితే గుడెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి దాహం వేసినా వేయకపోయినా క్రమం తప్పకుండా నీటిని తాగుతూ ఉండాలని సూచిస్తున్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి కచ్చితంగా నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
రోజులో కనీసం 8 గ్లాసుల నీరు తాగాలని వైద్యులు చెబుతున్నారు. నిత్యం సరిపడ నీరు తాగితే 80 శాతం వరకు రోగాలు రాకుండా చూసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇక మెదడు పనితీరు సరిగ్గా ఉండాలన్నా నీరు తాగాలని చెబుతున్నారు. శరీరానికి సరిపడా నీరు అందకపోతే ఏకాగ్రత కుదరదు, మతిమరుపు వేధిస్తుందని చెబుతున్నారు. డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు కూడా నీరు తీసుకోకపోవడం కారణమని చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..