Fact Check: నెబ్యులైజర్.. ఆక్సిజన్ కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలో నిజమెంత?

|

Apr 25, 2021 | 6:22 PM

కరోనా అనే వైరస్ ఒకటి ఉందని కొంత కాలం క్రితం వరకూ ఎవరికీ తెలీదు. ఈ వైరస్ కారణంగా ఇన్ని మరణాలు సంభావిస్తాయనీ ఎవరో అంచనా వేయలేదు. కానీ, ఒక భూతం లా విరుచుకుపడి ప్రజల ప్రాణాలను హరించేస్తోంది.

Fact Check: నెబ్యులైజర్.. ఆక్సిజన్ కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలో నిజమెంత?
Nebulizer
Follow us on

Fact Check: కరోనా అనే వైరస్ ఒకటి ఉందని కొంత కాలం క్రితం వరకూ ఎవరికీ తెలీదు. ఈ వైరస్ కారణంగా ఇన్ని మరణాలు సంభావిస్తాయనీ ఎవరో అంచనా వేయలేదు. కానీ, ఒక భూతం లా విరుచుకుపడి ప్రజల ప్రాణాలను హరించేస్తోంది. ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూ విచ్చలవిడిగా వ్యాపించేసి ప్రపంచాన్ని టెన్షన్ పెడుతోంది. అయితే, ఈ కరోనా పుణ్యమా అని చేతిలో ఫోన్.. మెదడులో కొంత ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ ఒకో వైద్యుడిలా తయారయిపోయారు. తమకు తోచిన విషయాన్ని.. చిలవలు వలవలుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వదిలేస్తున్నారు. ఈ సోషల్ మీడియా డాక్టర్లు చేస్తున్న కీడు అంతా ఇంతా అని చెప్పలేని పరిస్థితి. ఒకరకంగా కరోనా కంటే ఈ వైద్యం గురించిన అంశాలే సోషల్ మీడియాలో ఎక్కువ ప్రాచుర్యం లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా ఆక్సిజన్ కొరత అనే సంక్షోభానికి కొందరు సోషల్ మీడియా డాక్టర్లు.. నెబ్యులైజర్ తో చెక్ చెప్పోచ్చంటూ ప్రచారం మొదలు పెట్టారు. అసలు నెబ్యులైజర్ కి ఆక్సిజన్ కీ సంబంధం ఏమిటి? ఈ వార్తల్లో నిజమెంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

దీని గురించి చెప్పుకునే ముందు అసలు నెబ్యులైజర్ అంటే ఏమిటో చెప్పుకుందాం. నెబ్యులైజర్ ఏదైనా ఒక ద్రవం నుండి చక్కటి పొగమంచును సృష్టించే పరికరం. సాధారణంగా సంపీడన గాలి లేదా ఆక్సిజన్ ఉపయోగించి లేదా అల్ట్రాసోనిక్ వైబ్రేషన్ ద్వారా ఇది పనిచేస్తుంది. నెబ్యులైజర్ ఒక ఆవిరిని స్సృష్టించే పరికరం కన్నాకాస్త భిన్నంగా ఉంటుంది. ఇది పొగమంచును ఉత్పత్తి చేయడానికి వేడిని జెనరేట్ చేస్తుంది. అంటే.. ఈ పరికరంలో వేసిన మందు లేదా ఏదైనా ద్రవాన్ని మంచులాంటి పొగలా మార్చే యంత్రం నెబ్యులైజర్. సింపుల్ గా చెప్పాలంటే.. ఒక మందును ఇంజక్షన్ రూపంలో .. టాబ్లెట్ రూపంలో ఎలాగైతే తీసుకుంటామో.. గాలిరూపంలో ఆ మందును తీసుకునేలా చేసే పరికరం నెబ్యులైజర్. ఇది సాధారణంగా ఆస్తమా రోగులకు దానికి సంబంధించిన మందును శాసనాళాల్లోకి గాలిరూపంలో పంపించి వారి ఊపిరిని అడ్డుకుంటున్న పదార్ధాలను చెల్లా చెదురు చేసేలా చేస్తుంది.

ఇక ఆక్సిజన్ గురించి అందరికీ తెలిసిందే. ఇది ప్రాణవాయువు. ఇది సరిపడిన పరిమాణంలో మనం ముక్కుద్వారా శ్వాసించలేకపోతె ఇబ్బంది తలెత్తుతుంది. అటువంటి ఇబ్బందులు తలెత్తినపుడు సాధారణంగా బయట నుంచి ఆక్సిజన్ మద్దతు ఇస్తారు. ఇది నేరుగా ఇవ్వాల్సిందే. ఏదైనా పరికరం ద్వారా దీనిని మన శ్వాస నాళాల్లోకి పంపిస్తారు. దానికి చాలా పరికరాలుంటాయి. ఒక్కోసారి ఈ నెబ్యులైజర్ కూడా అందుకోసం ఉపయోగిస్తారు.

ఇక ఈ వీడియో డాక్టర్ అలోక్ నాద్ అనే ఆయన సోషల్ మీడియాలో ఉంచారు. కానీ, ఆయన అందులో ఆక్సిజన్ కు ప్రత్యామ్నాయంగా నెబ్యులైజర్ పని చేస్తుందని చెప్పారు. అయితే, ఇది పూర్తిగా తప్పు. ఈ విషయాన్ని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తూ సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ వీడియో వైరల్ గా మారిపోయింది.

వైరల్ గా మారిన వీడియో ఇది..

“ఒక నెబ్యులైజర్ ఔషధం యొక్క నిహారికలను అందిస్తుంది అలాగే, వాటిని కొంచెం నెట్టివేస్తుంది. ఇది ఆక్సిజన్ అవసరాన్ని తీర్చదు. వాస్తవానికి, కొన్ని సమయాల్లో, మీరు దానిని ఆక్సిజన్‌తో అనుసంధానించాలి ”అని స్కాట్లాండ్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ డాక్టర్ అవిరల్ వట్సా అన్నారు.

నేబ్యులైజర్ ఆక్సిజన్ కు ప్రత్యామ్నాయం కాదు అని చెబుతున్న వీడియో ఇదీ..

Also Read: Medaram Jathara: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారు.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి

Earth Day: లక్షలాది కొవ్వొత్తులతో ఎర్త్ డే ను ప్రకాశవంతం చేసిన బౌద్ధ సన్యాసులు.. గిన్నీస్ రికార్డు కోసం ప్రయత్నం!