ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నారు జనాలు. సోషల్ మీడియా వాడటం, చాటింగ్ చేయడం, ఇతరులకు ఫోన్ చేసి మాట్లాడటం లాంటి పనులు ప్రతిరోజూ సాధారణంగా జరిగేవి. అయితే ఫోన్‌లో ఎక్కువ సేపు మాట్లాడితే ఆరోగ్యానికి ముప్పు ఉంటుందని చైనా శాస్త్రవేత్త అధ్యయనంలో తేలడం చర్చనీయాంశమైంది. వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కవ సేపు ఫోన్‌లో మాట్లాడితే అధిక రక్తపోటు ముప్పు సుమారు 12 శాతం పెరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలు డిజిటల్ హెల్త్ అనే యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచూరితమయ్యాయి.
అయితే వారంలో 5 నిమిషాల కంటే తక్కువ మొబైల్‌లో మాట్లాడే వారితో పోలిస్తే 30-59 నిమిషాలు మాట్లాడే వారిలో 8 శాతం, 1-3 గంటలు మాట్లాడే వారిలో 13 శాతం, 4-6 గంటలు మాట్లాడే వారిలో 25 శాతం బీపీ పెరిగే ముప్పు ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అలాగే జన్యుపరంగా ముప్పు ఉన్న వారు వారానికి 30 నిమిషాల కంటే ఎక్కువ మొబైల్ మాట్లాడటం వల్ల హైబీపీ ప్రమాదం 33 శాతం ఎక్కువ ఉంటుందని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లు తక్కువ స్థాయి రేడియో ఫ్రీక్వెన్సీ శక్తిని విడుదల చేస్తాయని, దీనికి, రక్తపోటు పెరగడానికి ముడిపడి ఉంటుందని వెల్లడించారు.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం