Cancer: క్యాన్సర్‌ లక్షణాలు… వీటిలో ఏది కనిపించినా నిర్లక్ష్యం వద్దు..

|

Sep 28, 2024 | 11:31 AM

కొన్ని క్యాన్సర్‌లు వంశపారంపర్యంగా ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమించే ప్రమాదం ఉంది. చాలా రకాల క్యాన్సర్లు తీవ్రంగా ముదరకముందే గుర్తించి చికిత్సను తీసుకోవడం ద్వారా రోగులు ప్రాణాలతో బయటపడుతున్నారు. అందుకే క్యాన్సర్ సంకేతాలను నిర్లక్ష్యం చేయవద్దు.

Cancer: క్యాన్సర్‌ లక్షణాలు… వీటిలో ఏది కనిపించినా నిర్లక్ష్యం వద్దు..
Cancer Symptom
Follow us on

క్యాన్సర్.. అనేది ప్రాణాంతక వ్యాధి. లైఫ్ స్టైల్‌లో మార్పులు కారణంగా ఇటీవల కాలంలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగాయి. రకరకాల క్యాన్సర్స్ జనాల్ని బలి తీసుకుంటున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఈ మహమ్మారి అటాక్ చేస్తోంది. స్టార్టింగ్ స్టేజ్‌లోనే గుర్తిస్తే.. దీని బారి నుంచి బయటపడొచ్చు. అయితే క్యాన్సర్ సెల్స్ మన శరీరంలో ఫామ్ అవుతున్నప్పుడు కొన్ని సంకేతాలను పంపుతాయి. వాటిని పట్టించుకోకుండా.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. జనం కేర్ చేయకుండా అశ్రద్ధ చేస్తోన్న క్యాన్సర్ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

పుట్టుమచ్చలు, పులిపిర్లు పెరగడం: పుట్టుమచ్చలు అకస్మాత్తుగా ఏర్పడటం.. అవి పెరగడం… లేదా పులిపిర్లు పెరిగి, వాటి నుంచి రక్తస్రావం అవ్వడం క్యాన్సర్‌‌కు ఓ సిగ్నల్. చిన్న, చిన్న గాయాలు కూడా మానకుండా ఉంటే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.

వెయిట్ లాస్: ఏ రీజన్ లేకుండా ఒక్కసారిగా బరువు తగ్గితే , అది క్యాన్సర్ కారణంగా కావొచ్చు. కొద్ది రోజుల్లోనే 5 లేదా అంతకంటే ఎక్కువ కేజీలు బరువు తగ్గిపోతే.. వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లాలి. అన్నవాహిక క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, కడుపు క్యాన్సర్ వృద్ధి చెందుతున్న దశలో ఇలా జరుగుతుంది.

అలసట: నీరసాన్ని లైట్ తీసుకోడానికి లేదు. అలసట కూడా క్యాన్సర్ సింటమ్స్‌లో ఒకటి. విశ్రాంతి మంచిగా తీసుకున్నా.. నీరసంగానే ఉంటుంటే.. క్యాన్సర్ సంకేతంగానే భావించాలి.

అదేపనిగా తేలికపాటి జ్వరం: ఫీవర్ రావడం, తగ్గడం వంటివి జరుగుతుంటే నిర్లక్ష్యం వద్దు. క్యాన్సర్ కణాలు ఇతర శరీర భాగాలకు వ్యాప్తి చెందే సమయంలో జ్వరం వస్తుంది. తేలికపాటి జ్వరం రావడం, మెడిసిన్ తీసుకోగానే తగ్గడం జరుగుతుంది. అలా జ్వరం పదే, పదే రావడం క్యాన్సర్ లక్షణం. ఈ విషయంలో అలసత్వం వద్దు.

 దగ్గు: 3 వారాలకు మించి దగ్గు తగ్గకుండా ఉంటే వైద్యుడి వద్దకు వెళ్లండి. విపరీతంగా లోపలి నుంచి దగ్గు రావడం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ఒక సిగ్నల్.

 గడ్డ లేదా కణితి ఏర్పడటం: బాడీలో ఏదో ఒక ప్లేస్‌లో గడ్డ మాదిరిగా ఏర్పడి, ఎలాంటి పెయిన్ లేకుండా అది పెరుగుతూ ఉంటే, క్యాన్సర్‌కు సంకేతమే. ఇలాంటి 80 నుండి 90 శాతం కేసులలో క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది.

అలానే మలంలో అదే పనిగా రక్తం పడుతుంటే… అది మల క్యాన్సర్‌ లేదా పెద్ద పేగు క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చు. మూత్రంలో రక్తం పడుతుంటే.. అది కిడ్నీ క్యాన్సర్‌కు ఓ సిగ్నల్. శరీరంపై దురద రావడం, శరీర రంగు మారడం, మన బాడీతో పాటు… కళ్లు పసుపు పచ్చగా మారడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడ్ని సంప్రదించండి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..