Hair Loss: జుట్టు రాలే సమస్య నుంచి బయటపడాలంటే… ఈ ఆహారాలకు తప్పకుండా దూరంగా ఉండాల్సిందే!

ఒకప్పుడు దట్టంగా, నల్లగా నిగనిగలాడే జుట్టు ఇప్పుడు దిండు మీద, దువ్వెన మీద, బాత్‌రూమ్ ఫ్లోర్ మీద కనిస్తోందా? ఈ సమస్యకు ఒత్తిడి, కాలుష్యం, జన్యుపరమైన కారణాలతో పాటు… మీ రోజువారీ ఆహారం కూడా కారణం కావచ్చని తెలుసా! కొన్ని రుచికరమైన ఆహారాలు ..

Hair Loss: జుట్టు రాలే సమస్య నుంచి బయటపడాలంటే… ఈ ఆహారాలకు తప్పకుండా దూరంగా ఉండాల్సిందే!
Hair Loss Foods Avoid

Updated on: Dec 05, 2025 | 8:34 AM

ఒకప్పుడు దట్టంగా, నల్లగా నిగనిగలాడే జుట్టు ఇప్పుడు దిండు మీద, దువ్వెన మీద, బాత్‌రూమ్ ఫ్లోర్ మీద కనిస్తోందా? ఈ సమస్యకు ఒత్తిడి, కాలుష్యం, జన్యుపరమైన కారణాలతో పాటు… మీ రోజువారీ ఆహారం కూడా కారణం కావచ్చని తెలుసా! కొన్ని రుచికరమైన ఆహారాలు మనకు ఇష్టమైనా, జుట్టు మాత్రం వాటిని పడలేకపోతోంది! జుట్టు రాలడం ఇప్పుడు యువత నుంచి ముసలివాళ్ల వరకు అందరినీ వెంటాడుతున్న సమస్య.

దీనికి ప్రధాన కారణాల్లో ఆహారపు అలవాట్లు కూడా ఉన్నాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. మీ ఫుడ్ ప్లేట్‌లో ఉండే కొన్ని పదార్థాలు DHT (డైహైడ్రోటెస్టోస్టెరాన్) హార్మోన్ పెరిగి, జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తాయి. అవేంటో తెలుసుకుందాం…

  •  చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, మిఠాయిలు… రుచిలో టాప్ అయినా జుట్టుకు డేంజర్! అధిక చక్కెర రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి, హార్మోన్ల అసమతుల్యతను కలిగిస్తుంది. ఫలితంగా ఆండ్రోజెనిక్ అలోపేషియా (జుట్టు రాలడం) పెరుగుతుంది.
  •  ఫాస్ట్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్, బర్గర్, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్​లో ట్రాన్స్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి సెబమ్ గ్రంథులను అడ్డుకుని, తలపై డ్యాండ్రఫ్, ఇన్ఫెక్షన్లు పెంచుతాయి. ఫలితంగా జుట్టు బలహీనపడి రాలిపోతుంది.
  • ప్రాసెస్డ్ మీట్, రెడ్ మీట్, బేకన్, సాసేజెస్, బీప్​… ఇందులో ఉండే ప్రిజర్వేటివ్స్, సల్ఫైట్స్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెంచుతాయి. దీని వల్ల జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ తగ్గుతుంది.
  •  వైట్ బ్రెడ్, పాస్తా, తెల్ల బియ్యం, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచి, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు దారి తీస్తాయి. దీర్ఘకాలంలో ఇవి DHT పెరిగి జుట్టు రాలడాన్ని వేగవంతం చేస్తాయి.
  •  అధిక మోతాదులో ఆల్కహాల్ తాగినా జుట్టు రాలుతుంది. రోజూ రెండు పెగ్గులకు మించితే… శరీరంలో జింక్, ఐరన్, విటమిన్ B లోపం వస్తుంది. ఈ పోషకాలు జుట్టు పెరుగుదలకు అతి ముఖ్యమైనవి. వీటి లోపం వల్ల జుట్టు పల్చబడుతుంది, రాలుతుంది.
    ఈ ఆహారాలను తగ్గించి, బదులుగా గింజలు, ఆకుకూరలు, సాల్మన్ చేప, గుడ్లు, అవకాడో, పండ్లు ఎక్కువ తీసుకుంటే… 3-6 నెలల్లోనే జుట్టు రాలడం గణనీయంగా తగ్గుతుంది. మీ కేశసంరక్షణ మీ చేతిలోనే ఉంది మరి!