AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మగాళ్లు అలర్ట్.. మీరు చేసే ఈ తప్పులతో మీ స్పెర్మ్ కౌంట్ ఢమాల్.. డాక్టర్లు చెప్పేది వింటే షాకే..

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. మన జీవనశైలిలో తెలియకుండానే కొన్ని ప్రమాదకరమైన అలవాట్లు వచ్చి చేరుతున్నాయి. ముఖ్యంగా పురుషులలో ఫెర్టిలిటీ సామర్థ్యం గత కొన్ని ఏళ్లుగా వేగంగా క్షీణిస్తోందని వైద్య పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ల్యాప్‌టాప్ వాడకం నుండి నిద్ర, ఆహారం వరకు ఏవి మగవారిని తండ్రి అయ్యే అవకాశానికి దూరం చేస్తున్నాయి? అనేది తెలుసుకుందాం..

మగాళ్లు అలర్ట్.. మీరు చేసే ఈ తప్పులతో మీ స్పెర్మ్ కౌంట్ ఢమాల్.. డాక్టర్లు చెప్పేది వింటే షాకే..
How To Increase Sperm Count Naturally
Krishna S
|

Updated on: Feb 14, 2026 | 8:03 PM

Share

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనం సంపాదనపై చూపే శ్రద్ధ ఆరోగ్యంపై చూపడం లేదు. మారుతున్న జీవనశైలి, పెరిగిన పని ఒత్తిడి పురుషులలో కొత్త ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా సంతానలేమి సమస్య నేడు పురుషులలో వేగంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం వీర్య కణాల నాణ్యత పడిపోవడం. మంచి స్పెర్మ్ నాణ్యత అంటే కేవలం సంఖ్య మాత్రమే కాదు.. వాటి సరైన ఆకారం, కదలిక కూడా చాలా ముఖ్యం. అసలు మన ప్రమేయం లేకుండానే మనల్ని తండ్రి కాకుండా అడ్డుకుంటున్న ఆ అలవాట్లు ఏంటో ఆర్‌ఎంఎల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సుభాష్ గిరి వివరించారు.

స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీస్తున్న సైలెంట్ కిల్లర్ అలవాట్లు

డిజిటల్ హీట్: గంటల తరబడి ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పనిచేయడం వల్ల వృషణాల వద్ద ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది స్పెర్మ్ ఉత్పత్తిని నేరుగా దెబ్బతీస్తుంది. అలాగే మొబైల్‌ను ఎప్పుడూ ప్యాంటు జేబులోనే ఉంచుకోవడం కూడా హానికరమే.

వ్యసనాలు: ధూమపానం వల్ల రక్తప్రసరణ దెబ్బతిని స్పెర్మ్ సంఖ్య తగ్గుతుంది. మద్యం సేవించడం వల్ల టెస్టోస్టెరాన్ వంటి కీలక హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది.

నిద్రలేమి – ఒత్తిడి: రాత్రిళ్లు ఆలస్యంగా మేల్కొని ఉండటం వల్ల శరీరంలో హార్మోన్ల మార్పులు జరుగుతాయి. తీవ్రమైన మానసిక ఒత్తిడి స్పెర్మ్ ఉత్పత్తిని నిలిపివేసే హార్మోన్లను విడుదల చేస్తుంది.

జంక్ ఫుడ్ – పోషకాహార లోపం: విటమిన్లు, జింక్, యాంటీఆక్సిడెంట్లు లేని ఆహారం తీసుకోవడం వల్ల వీర్య కణాల నాణ్యత పడిపోతుంది.

బిగుతుగా ఉండే దుస్తులు: టైట్ జీన్స్ లేదా అండర్ వేర్ ధరించడం వల్ల ఆ భాగంలో వేడి పెరిగి స్పెర్మ్ కణాలు చనిపోయే అవకాశం ఉంది.

నాణ్యత తగ్గితే కలిగే నష్టాలు ఏంటి?

కేవలం సంతానం కలగకపోవడమే కాదు స్పెర్మ్ నాణ్యత తక్కువగా ఉంటే పురుషులలో ఈ లక్షణాలు కనిపిస్తాయి..

  • తీవ్రమైన అలసట మరియు నీరసం.
  • హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే చిరాకు.
  • లైంగిక సామర్థ్యం తగ్గడం.
  • మానసిక ఒత్తిడి పెరగడం.

మెరుగుపరుచుకోవడం ఎలా?

సమతుల్య ఆహారం: పండ్లు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.

వ్యాయామం: ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల నడక లేదా యోగా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి హార్మోన్లు సక్రమంగా విడుదలవుతాయి.

వేడికి దూరంగా: అధిక వేడి ఉండే ప్రదేశాల్లో పనిచేసే వారు జాగ్రత్తలు తీసుకోవాలి. వదులైన కాటన్ దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి.

హైడ్రేషన్: పుష్కలంగా నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

సంతానలేమి సమస్య ఎదురైనప్పుడు కేవలం మహిళలనే కాకుండా, పురుషులు కూడా తమ జీవనశైలిని సమీక్షించుకోవడం ముఖ్యం. చిన్న చిన్న మార్పులతోనే పెద్ద సమస్యల నుండి గట్టెక్కవచ్చు.