భళా కెప్టెన్! ప్రతిష్ఠాత్మక కోట్లా స్టేడియంలో కోహ్లీ స్టాండ్
భారత సారధి, రన్ మెషీన్ విరాట కోహ్లి అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లలో టాప్ లిస్ట్‌లో కోహ్లికి… సత్కారం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ). కోట్లా మైదానంలోని ఓ స్టాండ్‌కు విరాట్ పేరు పెట్టనుంది. సెప్టెంబర్ 12న జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా.. భారత జట్టును సత్కరించనుంది ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్. గతంలో భారత మాజీ క్రికెటర్లు, ఢిల్లీ క్రీడాకారులైన బిషన్ సింగ్, మొహిందర్ […]
భారత సారధి, రన్ మెషీన్ విరాట కోహ్లి అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లలో టాప్ లిస్ట్‌లో కోహ్లికి… సత్కారం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ). కోట్లా మైదానంలోని ఓ స్టాండ్‌కు విరాట్ పేరు పెట్టనుంది. సెప్టెంబర్ 12న జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా.. భారత జట్టును సత్కరించనుంది ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్. గతంలో భారత మాజీ క్రికెటర్లు, ఢిల్లీ క్రీడాకారులైన బిషన్ సింగ్, మొహిందర్ అమర్నాథ్కు ఇదే విధంగా గౌరవం దక్కింది. గతంలో వీరేందర్ సెహ్వాగ్, అంజుమ్ చోప్రాల పేర్లను మైదానంలోని స్వాగత ద్వారాలకు పెట్టింది ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్.