భారతదేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని తాజా నివేధికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి తొమ్మిది మంది భారతీయుల్లో ఒకరికి వారి జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితి తీవ్రతను తగ్గించడంలో నివారణ చర్యలు, ప్రారంభ దశలో వ్యాధిని నిర్ధారించడం, సరైన చికిత్స అందించడం కీలక పాత్ర పోషిస్తాయి. ఈ దిశగా MSD ఫార్మాస్యూటికల్స్ పబ్లిక్ అవేర్‌నెస్ ఇనిషియేటివ్లో భాగంగా #IOwe అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రముఖ నిపుణులు క్యాన్సర్ స్క్రీనింగ్, నిర్ధారణ, నివారణ, అధునాతన చికిత్సా విధానాల గురించి తమ అవగాహనను పంచుకుంటారు. క్యాన్సర్‌కు ఒక లక్షణం సరిపోతుందని, ఒక నిర్దిష్టమైన సైజు దాటితే తప్ప లక్షణాలు కనిపించకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏ లక్షణాల్ని సీరియస్‌గా తీసుకుని వెంటనే చికిత్సకు వెళ్ళాలనే అంశంపై అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. చాలా కేసులు సర్జరీ అవసరం లేకుండానే నయమయ్యే అవకాశముంది. అయితే చిన్న ట్యూమర్ అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తే.. సమస్య పెద్దదిగా మారే అవకాశముంది. క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది. ఈ ప్రత్యేక ఎపిసోడ్‌లను 04/06/2026, 05/06/2026 తేదీల్లో TV9లో వీక్షించవచ్చు. ఇది ప్రజా అవగాహన కోసం MSD ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ జారీ చేసిన సందేశం. మరింత సమాచారం కోసం దయచేచేసి మీ డాక్టర్‌ను సంప్రదించండి.