
చాలామంది లోన్ తీసుకునేటప్పుడు కేవలం వడ్డీ రేటును మాత్రమే చూస్తారు. కానీ, రేటులో 1% లేదా 2% మార్పు వచ్చినా, అది మొత్తం తిరిగిచెల్లింపుపై వేల రూపాయల ప్రభావాన్ని చూపుతుంది. రేటులో చిన్నపాటి వ్యత్యాసము కూడా వేలకొద్దీ రూపాయల అదనపు తిరిగిచెల్లింపుగా మారవచ్చు. అందుకే మీరు దరఖాస్తు చేసే ముందు మీ రేట్ ఎలా మీ ఈఎంఐని, మొత్తమ్మీది వ్యయాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది అర్థంచేసుకోవడం ముఖ్యం. అయితే బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ వార్షికంగా 10 శాతం నుండి 30 శాతం వరకు ఉండే వడ్డీ రేట్లతో రూ. 55 లక్షల వరకు లోన్ ఇస్తుంది. అది కూడా మీ లోన్ మొత్తాన్ని జస్ట్ 24 గంటలలోపు మీ అకౌంట్లో జమ చేస్తుంది. దీనితో ఇది పణాళిక చేయబడిన, అత్యవసర ఖర్చులకు రెండిటికి ఒక అనుకూలమైన ఎంపిక అవుతుంది.
పర్సనల్ లోన్ ఈఎంఐ అంటే ఏమిటి, దానిని ఎలా లెక్కిస్తారు?
ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. దీన్ని మీరు తీసుకున్న మొత్తం లోన్ పూర్తయ్యేంత వరకు ప్రతి నెల చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా మీ ఈఎంఐ 3 ముఖ్యమైన కారకాలచే నిర్ణయించబడుతుంది, ఋణ మొత్తము, పర్సనల్ లోన్ వడ్డీ రేటు, తిరిగిచెల్లింపు కాలపరిమితి. లోన్ ఇచ్చిన వాళ్లు ప్రతి నెల మీ కట్టాల్సిన అమౌంట్‌పై వడ్డీని లెక్కిస్తారు. మూలధనములో కొంత భాగాన్ని చేరుస్తారు, మీరు ఎంచుకున్న కాలవ్యవధిలో సమానంగా విభజిస్తారు. మీరు ఎలాంటి లెక్కంపు అవసరం లేకుండానే ఈ మూడు విలువలను ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ లో వేసి నెలవారి వాయిదాలను తక్షణమే తెలుసుకోవచ్చు.
EMIని ప్రభావితం చేసే అంశాలివే
పర్సనల్ లోన్ వడ్డీ రేటు మీ మొత్తం తిరిగిచెల్లింపును ఎలా ప్రభావితం చేస్తుంది
ఉదాహరణకు ఒక వ్యక్తి రూ. 5 లక్షల రుణాన్ని 5 ఏళ్ల కాలపరిమితికి తీసుకున్నారనుకుందాం.
10% వడ్డీ రేటు వద్ద: నెలవారీ ఈఎంఐ రూ. 10,624 అవుతుంది. మొత్తం తిరిగిచెల్లించే మొత్తం రూ. 6,37,411.
18% వడ్డీ రేటు వద్ద: నెలవారీ ఈఎంఐ రూ. 12,697 అవుతుంది. మొత్తం తిరిగిచెల్లించే మొత్తం రూ. 7,61,803.
కేవలం వడ్డీ రేటు పెరగడం వల్ల రుణగ్రహీత రూ. 1.24 లక్షలకు పైగా అదనంగా చెల్లించాల్సి వస్తుంది. అందుకే తక్కువ వడ్డీ రేటు పొందేందుకు 650 కంటే ఎక్కువ సిబిల్ (CIBIL) స్కోర్ కలిగి ఉండటం ప్రయోజనకరమని నిపుణులు సూచిస్తున్నారు.
బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ ఎందుకు ఎంచుకోవాలి
ఖర్చులకు అనుగుణంగా ప్రణాళిక చేసుకునే వారి కోసం బజాజ్ ఫిన్సర్వ్ అనేక రకాల రుణ వెసులుబాట్లను అందిస్తోంది.
బజాజ్ ఫైనాన్స్ మూడు పర్సనల్ లోన్ రకాలను కూడా అందిస్తుంది.
టర్మ్ లోన్: ఈ లోన్ మొత్తాన్ని ఒకే సారి అందిస్తారు. ప్రతి నెలా సమాన వాయుదాలతో తిరిగి చెల్లించాలి
ఫ్లెక్సి టర్మ్ (డ్రాప్లైన్) లోన్: ముందుగా-ఆమోదించబడిన పరిమితి నుండి విత్‌డ్రా చేసుకోండి. మీరు ఉపయోగించుకున్న మొత్తానికి మాత్రమే వడ్డీ చెల్లించండి.
ఫ్లెక్సి హైబ్రిడ్ టర్మ్ లోన్: మొదట్లో వడ్డీ-మాత్రమే ఈఎంఐలు, ఆ తరువాత క్రమబద్ధీకరించబడిన ఈఎంఐలు
ఫ్లెక్సి హైబ్రిడ్ లోన్: కొత్త తరం రుణ ఎంపిక
బజాజ్ ఫైనాన్స్ ప్రత్యేకంగా ‘ఫ్లెక్సి హైబ్రిడ్ టర్మ్ లోన్’ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా రుణగ్రహీతలు తమకు కేటాయించిన పరిమితి నుండి అవసరమైనప్పుడు డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ముఖ్యంగా, ప్రారంభ కాలపరిమితిలో (36 నెలల వరకు) కేవలం వడ్డీని మాత్రమే ఈఎంఐగా చెల్లించే సౌకర్యం ఉంటుంది. ఇది నెలవారీ బడ్జెట్‌పై ఒత్తిడిని తగ్గిస్తుంది
ఎలా ధరఖాస్తు చేసుకోవాలి
లోన్ తీసుకునేముందు తెలివిగా ప్రణాళిక చేసుకోండి
రుణం తీసుకునే ముందు ‘ఈఎంఐ కాలిక్యులేటర్’ వాడటం వల్ల వివిధ వడ్డీ రేట్లు, కాలపరిమితులను పోల్చి చూసుకోవచ్చు. సరైన ప్రణాళికతో తీసుకునే రుణం ఆర్థిక భారం కాకుండా, ఆపత్కాలంలో గొప్ప ఆసరాగా నిలుస్తుంది.