తన ముద్దు ముద్దు చేష్టలతో తరచుగా సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుమార్తె జీవా. అయితే ఈ నాలుగున్నరేళ్ల చిన్నది ఇప్పుడు బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌పై తండ్రికి ఫిర్యాదు చేసిందట. ఇంతకు రణ్‌వీర్‌పై జీవా ఎందుకు కంప్లైంట్ చేసింది అనుకుంటున్నారా..!
మరేంలేదంటి ఫ్యాషన్ ఐకాన్‌గా పేరొందిన రణ్‌వీర్ సింగ్ ఇటీవల ఓ ఫొటోకు ఫోజు ఇచ్చారు. అందులో రణ్‌వీర్ ఓ గ్లాసెస్ పెట్టుకున్నారు. ఇక ఆ ఫొటోను చూసిన జీవా తండ్రి వద్దకు వచ్చి.. ఎందుకు అతడు నా గ్లాసెస్ పెట్టుకున్నాడు అని అడిగిందట. ఆ తరువాత తన రూమ్‌లోకి వెళ్లి గ్లాసెస్ చూసుకొని.. నావి నా దగ్గరే ఉన్నాయిలే అని చెప్పిందట. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన ధోని.. ‘‘ఇప్పటికాలంలో పిల్లలు ముదుర్లుగా తయారయ్యారు. నాలుగున్నర సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇలాంటి విషయాలను నేను కనీసం గుర్తించలేదు. ఎప్పుడైనా జీవా ధోనిని రణ్‌వీర్‌ను కలిస్తే.. నీలాంటి గ్లాసెస్ నా దగ్గర కూడా ఉన్నాయి అని కచ్చితంగా చెప్తుంది’’ అని ట్వీట్ చేశాడు. దానికి రణ్‌వీర్.. హా హా హా హా ఫ్యాషన్ ఇష్టా అని కామెంట్ పెట్టాడు.