
కానీ, ఈ అందాల భామ మాత్రం ఏకంగా 20+ కిలోల బరువును ఎత్తి ‘గోబ్లెట్ స్క్వాట్స్’ చేస్తూ ఫిట్‌నెస్ ప్రియుల మతి పోగొడుతోంది. ఆమె వర్కవుట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
ఆమె ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సరసన పరిచయమై, తన రూపంతో అందరినీ ఆకట్టుకుంది. కాలక్రమేణా తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ఈ నటి, ఇప్పుడు ఏకంగా హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ కనిపిస్తోంది. 38 ఏళ్ల వయసులో కూడా ఇంతటి శక్తి ఆమెకు ఎక్కడ నుండి వచ్చింది? తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో 70 పౌండ్ల (30 కిలోల) బరువును పట్టుకుని స్క్వాట్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ పవర్‌ఫుల్ వర్కవుట్ వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ అద్భుతమైన నటి మరెవరో కాదు.. జరీన్ ఖాన్.
జరీన్ ఖాన్ చేస్తున్న ఈ వ్యాయామాన్ని ‘గోబ్లెట్ స్క్వాట్స్’ అని పిలుస్తారు. ఇందులో బరువును గుండెకు దగ్గరగా పట్టుకుని కూర్చుని లేవాల్సి ఉంటుంది. ఇది కేవలం కాళ్లకే కాకుండా శరీరంలోని వివిధ కండరాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్వాడ్రిసెప్స్, గ్లూట్స్, హ్యామ్‌స్ట్రింగ్స్ వంటి కండరాలు బలోపేతం అవుతాయి. బరువును ఛాతీకి దగ్గరగా పట్టుకోవడం వల్ల శరీర భంగిమ మెరుగుపడటమే కాకుండా, వెన్నెముక నిటారుగా ఉంటుంది.
జరీన్ ఖాన్ చేస్తున్న ఈ భారీ వర్కవుట్ గురించి డైటీషియన్ గరిమా గోయల్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 30 కిలోల బరువుతో స్క్వాట్స్ చేయడం అనేది అడ్వాన్స్‌డ్ స్ట్రెంత్ కండిషనింగ్‌కు నిదర్శనం అని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలకు ఇలాంటి వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాలు ఎంతో అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.
జరీన్ ఖాన్ కేవలం తన అందంతోనే కాకుండా, తన శక్తితోనూ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా సరైన శిక్షణతో ఇటువంటి కఠినమైన వ్యాయామాలు చేయవచ్చని ఆమె నిరూపిస్తోంది.