Zombie Reddy Movie: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర చిత్రంలో చైల్డ్ యాక్టర్‌గా నటించిన తేజ సజ్జ ఎంతో మంది ప్రేక్షకులకు పరిచయమే. ఈ సినిమాలో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఈ నటుడు హీరోగా ఎంట్రీ ఇస్తూ చేస్తున్న మూవీ జాంబిరెడ్డి. కల్కి ఫేం ప్రశాంత్ వర్మ డైరెక్షన్ వహిస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 5న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం జాంబిరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. టాలీవుడ్ నటుడు వరుణ్ తేజ్, డైరెక్టర్లు బాబీ, తరుణ్ భాస్కర్ తదితరులు ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. కరోనా కారణంగా మేం చాలా ఫిల్మ్ ఫంక్షన్లను మిస్ అయ్యాం. ఈ ఈవెంట్‌కు ఆహ్వానించిన చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు. జాంబిరెడ్డి టైటిల్ చమత్కారంగా అనిపించింది. అందరిని ఆకట్టుకునేలా టైటిల్ ఉంది. జాంబి చాలా సక్సెస్ ఫుల్ జోనర్. ప్రశాంత్ వర్మ చాలా టాలెంటెడ్ డైరెక్టర్. హీరోగా తొలి సినిమానే జాంబిరెడ్డి లాంటి విభిన్న స్టోరీతో చేస్తున్న తేజ సజ్జను అభినందిస్తున్నా. తేజ అంటే పెద్దనాన్న చిరంజీవికి చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు వరుణ్‌తేజ్