
RRR movie updates: ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో చెర్రీ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. అలియా భట్ చెర్రీ సరసన నటిస్తోంది. ఇప్పటికే 70శాతానికి పైగా ఈ మూవీ షూటింగ్ పూర్తైంది. కాగా ఇందులో చెర్రీ, ఎన్టీఆర్, అలియా భట్ చిన్నప్పటి పాత్రల్లో నటించేది వీరేనంటూ ఇప్పుడు కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఉడాన్ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన స్పందన్ చతుర్వేది అలియా పాత్రలో కనిపించనున్నారు. హిందీలో పలు చిత్రాల్లో నటించిన వరుణ్ బుద్దాదేవ్ ఎన్టీఆర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు తెలుగు చిత్రాల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ చక్రి, రామ్ చరణ్ పాత్రలో నటించనున్నారు. కాగా డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Read More:
Breaking: బీజేపీ సీనియర్ నేత ఉమా భారతికి కరోనా
కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నమూత